గ్లామ్‌షాట్‌: సిల్వర్‌ బ్యూటీ 'జిగేల్‌' గ్లామర్‌

మరిన్ని వార్తలు

అమలాపాల్‌కి అందమే కాదు, కాంట్రవర్సీలు కూడా కూసింత ఎక్కువేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఎప్పుడూ కాంట్రవర్సీలే అయినా బోర్‌ కొడుతుంది కదా. అందుకే అప్పుడప్పుడూ హాట్‌ హాట్‌ ఫోటో సెషన్‌ చేయించుకుని, సోషల్‌మీడియాలో వాటిని పోస్ట్‌ చేసి అభిమానుల మెప్పు పొందుతూ ఉంటుంది. 

 

తాజాగా అమలాపాల్‌ పోస్ట్‌ చేసిన ఈ పిక్‌ చూశారుగా. సింప్లీ సూపర్బ్‌ అనేలా ఉంది. సిల్వర్‌ కలర్‌ టాప్‌లో, లెదర్‌ రెడ్‌ కలర్‌ బోటమ్‌తో తలపై రెడ్‌ కలర్‌ కొమ్ముల్లాంటి డెకరేటివ్‌ ఐటెమ్‌తో ఎక్స్‌ప్రెసివ్‌ లుక్స్‌తో కనిపిస్తోంది. ఆమె వెనక దాగి ఉన్న క్రిస్టమస్ ట్రీ ఆమె అందానికి మరింత జిగేల్‌మని మెరుపులీనుతోంది. 

 

తెలుగులో 'బెజవాడ', ఎవడు' తదితర సినిమాల్లో నటించిన అమలాపాల్‌ ప్రస్తుతం మలయాళ, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. మంచి కథలొస్తే, తెలుగులో నటించేందుకు ఎప్పుడూ సిద్ధమే అంటోంది అందాల అమలాపాల్‌. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS