మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'జవాన్'. బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సరికొత్త సబ్జెక్ట్‌తో రూపొందుతున్న సినిమా ఇది. ఇప్పుడొస్తున్న రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉంటుందట. సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చేలా ఈ సినిమా కాన్సెప్ట్ ఉండబోతోందట. 'జవాన్' అంటే యుద్ధ భూమిలో శత్రువులతో పోరాడే సైనికుడు కాదు. తన కుటుంబం కోసం పోరాడే జవాన్. ఈ జవాన్ కూడా యుద్ధ భూమిలో శత్రువులతో ఎలా పోరాడతాడో, తన కుటుంబం కోసం కూడా అలాగే పోరాడతాడట. దేశం కోసం పోరాడే సైనికుడిలా, 'జవాన్' లాంటి వాడు ప్రతీ కుటుంబానికి ఉండాలన్న సబ్జెక్ట్ హార్ట్ టచ్చింగ్‌గా ఉంటుందట. అలాగే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా. సరికొత్త కామెడీ ట్రాక్‌ని ఈ సినిమాలో జోడించారట. ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ డాన్సులు, యాక్టింగ్ స్కిల్స్‌ని కొత్తగా డిజైన్ చేశారట. అందుకే సరికొత్తగా కనిపించనున్నాడు తేజు ఈ సినిమాలో. 'సుప్రీమ్' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తేజుకి 'తిక్క' సినిమా కొంత నిరాశపరిచింది. తర్వాత 'విన్నర్'తో మళ్లీ తేరుకున్నాడు తేజు. ఇప్పుడు రాబోతున్న 'జవాన్' ఖచ్చితంగా విజయం తెచ్చి పెడ్తుందని ఆశిస్తున్నాడు. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' ఫేం మెహరీన్ కౌర్ ఈ సినిమాలో తేజుకి జంటగా నటిస్తోంది.