బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. `ఛత్రపతి` రీమేక్ ద్వారా బాలీవడ్ లో అరంగేట్రం చేయబోతున్నాడు. వివివినాయక్ ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటి వరకూ కథానాయిక ఫైనలైజ్ అవ్వలేదు. రష్మిక, సాయిపల్లవి లాంటి వాళ్లని పరిశీలించినా, వాళ్ల కాల్షీట్ల ఏమాత్రం ఖాళీ లేవని తెలిసింది. అందుకే బాలీవుడ్ హీరోయిన్ ని ఒప్పించాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి. ఎంత పారితోషికం ఇస్తామన్నా... ఈ సినిమా చేయడానికి ఎవరి దగ్గరా డేట్లు లేవంటున్నారు. కొత్తమ్మాయిని తీసుకొనే పరిస్థితి ఏమాత్రం లేదు. బెల్లం కొండ సినిమా అంటే స్టార్ హీరోయిన్ తప్పని సరి. వాళ్లేమో దొరకడం లేదు. అందుకే ఛత్రపతి షూటింగ్ ఆలస్యం అవుతోందని సమాచారం.
ప్లాన్ 'బి' గా... హీరోయిన్ లేని సీన్లని ముందు పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. హీరో ఫ్లాష్ బ్యాక్, ఇంట్రడక్షన్ సీన్లని ముందు తీసేయాలని వినాయక్ అనుకుంటున్నాడట. ఇందుకోసం హైదరాబాద్ లో ఓ ప్రత్యేకమైన సెట్ తీర్చిదిద్దారు. అందులోనే షూటింగ్ మొదలు కానుంది. తొలి షెడ్యూల్ అయ్యేలోగా కథానాయిక విషయంలో ఓ క్లారిటీ తెచ్చుకోవాలని వినాయక్ భావిస్తున్నాడు. ఛత్రపతి కి సంబంధించిన అప్ డేట్ ఒకటి త్వరలోనే అఫీషియల్ గా రాబోతోంది. అందులో హీరోయిన్ గురించి ఏమైనా హింట్ ఉంటుదేమో చూడాలి.