హీరోయిన్ల‌కు క‌రోనా భ‌యం!

మరిన్ని వార్తలు

జూన్ మొద‌టి వారంలో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌లెట్ట‌డానికి అన్ని ఏర్పాట్లూ జ‌రుగుతున్నాయి. ద‌ర్శ‌క నిర్మాత‌లు అప్పుడే కొత్త షెడ్యూల్స్ ని రూపొందించ‌డంలో బిజీగా ఉన్నారు. ఒక‌రిద్ద‌రు పెద్ద హీరోలు మిన‌హాయిస్తే, మిగిలిన వాళ్లంతా షూటింగుల‌కు రెడీనే. అయితే ఇప్పుడు స‌మ‌స్య‌.. హీరోల నుంచి కాదు, హీరోయిన్ల నుంచి.

 

అవును.. షూటింగులు ప్రారంభ‌మైనా, హీరోలు సెట్లోకి వ‌చ్చినా, హీరోయిన్లు మాత్రం అడుగు ముందుకు వేయ‌డానికి జంకుతున్నారు. కొంత‌మంది హీరోయిన్లైతే.. `మేం షూటింగుల‌కు రాము.. రాలేము..` అని నేరుగా చెప్పేస్తున్నార్ట‌. క‌రోనా భ‌యాలు త‌గ్గేంత వ‌ర‌కూ షూటింగుల‌కు చేయ‌లేమ‌ని ఓ అగ్ర క‌థానాయిక నిర్మాత‌కు చెప్పింద‌ని, మిగిలిన‌వాళ్లూ వ‌స్తారో, రారో చెప్ప‌లేమ‌ని టాక్‌. ఇప్ప‌టికే షూటింగులు మొద‌లు కాని సినిమాలైతే ఫ‌ర్వాలేదు. క‌థానాయిక‌ల్ని మార్చుకునే ఛాన్సు వుంది. ఆల్రెడీ కొంత భాగం షూటింగు చేసిన సినిమాల‌కే అస‌లు స‌మ‌స్య‌. వాళ్లు హీరోయిన్ల‌ను మార్చ‌లేరు. అలాగ‌ని హీరోయిన్లు సెట్‌కి వ‌చ్చేంత వ‌ర‌కూ ఎదురు చూడ‌లేరు. హీరోయిన్లే కాదు, కొంత‌మంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు కూడా... షూటింగుల‌కు నో చెబుతున్నార్ట‌. ఇలాగైతే చిత్రీక‌ర‌ణ‌ల‌న్నీ అనుకున్న‌వి అనుకున్న‌ట్టు జ‌రుగుతాయా? అనే అనుమానం వేస్తోంది.

 

హీరోలు, హీరోయిన్లు, మిగిలిన న‌టీన‌టులూ భ‌యాల‌ను వ‌దిలి - బ‌య‌ట‌కు రాగ‌లిగితేనే.. షూటింగ్‌లు క‌రెక్టుగా సాగుతాయి. మ‌రి అలా జ‌రుగుతాయో లేదో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS