'చూసీ చూడంగానే' ఆ కుర్రాడు నచ్చేస్తాడా?

By Inkmantra - January 29, 2020 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

'పెళ్లిచూపులు' తదితర చిత్రాలతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా డెబ్యూ చేస్తున్న సినిమా 'చూసీ చూడంగానే'. చిన్న సినిమా అయినా ఈ సినిమాని ప్రమోట్‌ చేస్తున్న విధానం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రోమోస్‌లో శివ కందుకూరి బాగానే ఎట్రాక్ట్‌ చేస్తున్నాడు. యూత్‌ని బేస్‌ చేసుకుని తెరకెక్కించిన చిత్రమిది. ఖచ్చితంగా యూత్‌ని మెప్పిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. శేష సింధు దర్శకురాలిగా ఈ సినిమాని రాజ్‌ కందుకూరి నిర్మించారు.

 

ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నట్లు ఇంకా తొలి సినిమా విడుదల కాకుండానే, ఈ యంగ్‌ హీరో మరో రెండు సినిమాల్లో ఛాన్స్‌ కొట్టేశాడు. వాటిలో ఒకటి ఆల్రెడీ నిర్మాణం కూడా జరిగిపోయింది. 'టాక్సీవాలా' బ్యూటీ ప్రియాంకా జవాల్కర్‌ ఈ సినిమాలో శివ కందుకూరికి జోడీగా నటించింది. అలాగే మరో కొత్త లేడీ దర్శకురాలు సృజనా రావ్‌తో శివ కందుకూరి ఓ చిత్రంలో నటిస్తున్నాడు. చిన్నతనం నుండీ నటనపై ఎంతో ఆసక్తి కనిబరిచాడట శివ కందుకూరి. నటన పట్ల కుమారుడికి ఉన్న ప్యాషన్‌ని గుర్తించి ఆయనతో 'చూసీ చూడంగానే' చిత్రాన్ని రూపొందించారు రాజ్‌. మరి తొలి ప్రయత్నంలోనే ఈ యంగ్‌ హీరోని విజయం వరిóంచాలని ఆశిద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS