ఏవండోయ్‌ నానీగారూ అంచనాలు బాగానే పెంచేశారూ!

మరిన్ని వార్తలు

నాని హీరోగా తెరకెక్కిన 'గ్యాంగ్‌లీడర్‌' చిత్రం రేపు అనగా సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదట్లో ఓ మోస్తరు అంచనాలున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గర పడిన కొద్దీ అంచనాలు అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చింది. 'సాహో' కోసం తన రిలీజ్‌ డేట్‌ త్యాగం చేశాడు నాని. కానీ, ఆ సినిమా రిజల్ట్‌ బెడిసి కొట్టింది. 'సాహో' ఎఫెక్ట్‌ పుణ్యమా అని, గత వారం కూడా కొత్త సినిమాలేమీ ధియేటర్స్‌లో సందడి చేయలేదు.

 

సో డల్‌గా ఉన్న బాక్సాఫీస్‌కి నాని తన 'గ్యాంగ్‌లీడర్‌'తో ఊపు తెప్పించాల్సి ఉంది. తన మార్కెట్‌కి మించి ఈ సినిమాకి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్‌లోనూ నానికి మంచి మార్కెట్‌ ఉండడంతో, అక్కడ కూడా బిజినెస్‌ బాగా జరిగింది 'గ్యాంగ్‌ లీడర్‌'కి. ఇక సినిమాలో కంటెంట్‌ కూడా ఆశక్తికరంగా ఉండడం, విక్రమ్‌ కుమార్‌ టేకింగ్‌పై నమ్మకం ఉండడంతో 'గ్యాంగ్‌ లీడర్‌' విడుదలకొచ్చేసరికి మంచి అంచనాల్ని క్రియేట్‌ చేసింది. ఇదిలా ఉంటే, ప్రమోషన్స్‌ జోరు కూడా బాగా కలిసొచ్చింది.

 

అనిరుధ్‌ రవిచంద్రన్‌ మ్యూజిక్‌ ఈ సారి కిక్కిచ్చేలా ఉంది. టైటిల్‌ సాంగ్‌తో అనిరుధ్‌ చేసిన రచ్చ అందర్నీ ఆకర్షిస్తోంది. సాహో దెబ్బతో డల్‌గా ఫీలవుతున్న ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించేందుకు నాని అండ్‌ గ్యాంగ్‌ తన ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే ఆయుధంతో, కాన్ఫిడెన్స్‌ అనే గట్స్‌తో రంగంలోకి దిగబోతున్నారు. చూడాలి మరి, వీరి కాన్ఫిడెన్స్‌ ఫలిస్తుందా.? అభిమానులు నానికి పట్టం కడతారా.? బాక్సాఫీస్‌ కళకళలాడుతుందా.? ఇవన్నీ జరిగేందుకు మరి కొద్ది గంటలు మాత్రమే ఉంది. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS