'తలైవార్‌' నెవ్వర్‌ సీన్‌ బిఫోర్‌ అవతార్‌.!

By Inkmantra - September 12, 2019 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

తలైవా రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం 'దర్బార్‌' నుండి తాజాగా ఓ పోస్టర్‌ విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఈ పోస్టర్‌లో రజనీ రియల్‌ సింహంలా గర్జిస్తూ కనిపించారు. రజనీ స్టైల్‌ అంటే ఎందుకు అభిమానులు అంతలా పడి చచ్చిపోతారో ఈ పోస్టర్‌ చూస్తేనే అర్ధమవుతుంది. వయసుతో సంబంధం లేకుండా, చొక్కా విప్పిన సల్మాన్‌ ఖాన్‌లా రజనీ కాంత్‌ బాడీ బిల్డింగ్‌ చూపిస్తుంటే, ఫ్యాన్స్‌ పూనకంతో ఊగిపోతున్నారు.

 

దర్శకుడు మురుగదాస్‌ ఈ పోస్టర్‌ని రిలీజ్‌ చేస్తూ, 'యంగర్‌, స్ట్రాంగర్‌, వైజర్‌, రఫ్పర్‌, తలైవార్‌ నెవ్వర్‌ సీన్‌ బిఫోర్‌ అవతార్‌..' అని అదిరిపోయే క్యాప్షన్‌ ఇచ్చారు. నిజంగానే ఈ లుక్‌ సూపర్‌ అనిపిస్తోంది. ఇంతవరకూ చాలా పోస్టర్లు రిలీజయ్యాయి ఈ సినిమా నుండి. కానీ, ఈ లుక్‌ మాత్రం నెవ్వర్‌ బిఫోర్‌ అనేలానే ఉంది. ఇకపోతే పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో నయనతార, సూపర్‌స్టార్‌కి జోడీగా నటిస్తోంది.

 

శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'పేట' చిత్రం తర్వాత వరుసగా అనిరుధ్‌ రవిచంద్రన్‌ రెండోసారి రజనీ చిత్రానికి మ్యూజిక్‌ అందిస్తున్నారు. మలయాళ కుట్టీ నివేదా థామస్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS