'సాహో' హంగామా ముగిసింది. ఇప్పుడు 'సైరా' సందడి మొదలైంది. మార్కెట్ పరంగా, వసూళ్ల పరంగా సైరా సరికొత్త రికార్డులు సృష్టించబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దానికి తగ్గట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి రూ.300 కోట్ల బిజినెస్ జరిగిందని టాక్. థియేట్రికల్ రైట్స్ రూ.190 కోట్లకు అమ్ముడైతే, నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 110 కోట్లు వచ్చాయి.
నైజాంలో రూ.30 కోట్లకు, సీడెడ్‌లో రూ.20 కోట్లకు అమ్ముడైన సైరా.. ఓవర్సీస్‌లో 18 కోట్లు దక్కించుకోగలిగింది.ఈస్ట్, వెస్ట్ కలిపి మరో 20 కోట్లు వచ్చాయి. కర్నాటక హక్కుల రూపంలో 27 కోట్లు వచ్చాయి. నార్త్ ఇండియా మొత్తం 25 కోట్లకు అమ్ముడైంది. చిరంజీవి `ఖైది నెం.150` వసూళ్లకంటే... ఈ రేట్లు చాలా ఎక్కువ. కొన్ని చోట్ల `సాహో` బిజినెస్‌ని కూడా క్రాస్ చేయగలిగింది. అక్టోబరు 2న `సైరా` విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. మరి విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో చూడాలి.