రష్మికా అప్పుడే అంత పెంచేసిందా?

మరిన్ని వార్తలు

కన్నడ బ్యూటీ రష్మికా మండన్నాకి తెలుగులో సూపర్‌ పాపులారిటీ ఉందిప్పుడు. చేసినవి రెండు సినిమాలే అయినా, రెండూ సూపర్‌ హిట్సే. రెండో సినిమా 'గీత గోవిందం' సంచలన విజయం అందుకుంది. దాంతోనే అమ్మడి దశ తిరిగిపోయింది. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో రాబోతున్న 'డియర్‌ కామ్రేడ్‌'పైనే అందరి దృష్టి. స్టూడెంట్‌ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మికా, విజయ్‌ దేవరకొండ ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ మరోసారి కిక్కెక్కించనుంది.

 

ఈ కాంబోకి ఉన్న క్రేజ్‌తోనే ఈ సినిమాకి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ బాగా జరిగిందట. ఓవర్సీస్‌ బిజినెస్‌ కూడా బాగా జరిగిందనీ సమాచారమ్‌. ఇదిలా ఉంటే, ఈ సినిమాకి రష్మికా రెమ్యునరేషన్‌ బాగా పెంచేసిందని తెలుస్తోంది. దాదాపు 80 లక్షల వరకూ తీసుకుంటోందట. నెక్స్ట్‌ రష్మికా సుకుమార్‌ సినిమాలో నటించనుంది. అల్లు అర్జున్‌ ఈ సినిమాలో హీరో. ఈ సినిమాకి రష్మికా ఇంకా ఎక్కువ డిమాండ్‌ చేస్తోందనీ తెలుస్తోంది. ఆ ఫిగర్‌ కోటి అని ప్రచారం జరుగుతోంది. ఇదిలా కొనసాగితే, రష్మికా అతి త్వరలోనే ఎక్కువ రెమ్యునరేషన్‌ అందుకుంటున్న అతి తక్కువ మంది హీరోయిన్స్‌ లిస్ట్‌ని రీచ్‌ అవ్వడం ఎంతో దూరం లేదనిపిస్తోంది.

 

అనుష్క, నయనతార సౌత్‌లో ఇంతవరకూ ఎక్కువ రెమ్యునరేషన్‌ అందుకుంటున్న ముద్దుగుమ్మల లిస్టులో ఉన్నారు. మరి వారి స్థానానికి రష్మికా గండి కొట్టేస్తుందా.? అబ్బే అంత సీను లేదంటారా.? ఏమో చెప్పలేం. కానీ అది డిసైడ్‌ కావాలంటే 'డియర్‌ కామ్రేడ్‌' ఖచ్చితంగా సూపర్‌ బ్లాక్‌బస్టర్‌ అవ్వాలి. జూలై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భరత్‌ కమ్మ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS