యాంకర్ కమ్ యాక్టర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా త్వరలో రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. కొత్త డైరెక్టర్ మున్నా తెరకెక్కించిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర యూనిట్ కాలేజ్ టూర్స్‌లో బిజీగా ఉంది. ప్రస్తుతం చిన్న సినిమాలన్నీ కాలేజ్‌లే ప్రామాణికంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నాయి. అందుకే యూత్ బేస్‌ని బ్యాలెన్స్ చేసుకునే ఆయా సినిమాలు రూపొందుతున్నాయి.
ప్రదీప్ మాచిరాజుకు యాంకర్‌గా యూత్‌లో పిచ్చ పిచ్చగా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రేజ్‌నే క్యాష్ చేసుకోవానుకుంటున్నాడు. అందుకు తగ్గట్లుగానే సినిమా నుండి రిలీజైన రెండు పాటల్తో యూత్ హృదయాల్నికొల్లగొట్టేసాడు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్‌లో వచ్చిన ఈ రెండు పాటలూ రిలీజ్‌కి ముందే సినిమాపై బజ్ పెంచేశాయి. అయితే ఇది సరిపోతుందా.? అందుకే ప్రమోషన్స్‌లో భాగంగా లేటెస్ట్‌గా వరంగల్, ఖమ్మంలోని కొన్ని కాలేజీలను సందర్శించి, స్టూడెంట్స్‌ని మీట్ అవ్వనున్నాడు ప్రదీప్. అంతా బాగానే ఉంది. కానీ, యాంకర్‌గా తనకున్న ఫాలోయింగ్‌తో ప్రదీప్ మాచిరాజు హీరోగా నిలదొక్కుకుంటాడా.? చూడాలి మరి. మార్చి 25న ఈ సినిమా రిలీజ్ కానుంది.