సమంత అక్కినేని ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'ఓ బేబీ' ప్రమోషన్స్ అదిరిపోతున్నాయి. ఏకంగా ప్రమోషన్స్‌లో భాగంగా హైద్రాబాద్‌లోని ఓ ధియేటర్ వద్ద సమంతకు ఓ భారీ కటౌట్ ఏర్పాటు చేసేశారు సమంత ఫ్యాన్స్. ఈ సినిమాకి ఫాలోయింగ్ ఆ రేంజ్లో ఉంది. ఏ చిన్న అవకాశాన్నీ వదిలి పెట్టడం లేదు 'ఓ బేబీ' టీమ్.
టీమ్ అనే దాని కన్నా, ప్రమోషన్స్‌కి కర్త, కర్మ, అన్నీ తానై చూసుకుంటోంది సమంత. పలు ఛానెల్స్‌లో కలర్ఫుల్గా ఇంటర్వ్యూలు ఇస్తోంది. 'ఓ బేబీ' సినిమాలో సమంత పాత్ర గురించి తెలిసిందే. 70 ఏళ్ల బామ్మ సడెన్‌గా 25 ఏళ్ల భామగా మారిపోతుంది. 25 ఏళ్ల వయసులో తాను చేయలేకపోయిన స్టైల్స్, సరదాలూ తిరిగొచ్చిన వయసులో ఆ బామ్మ తీర్చుకోవడం ఫన్నీగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు 70 ఏళ్ల బామ్మ, ఆమెకు 25 ఏళ్లు అంటే పాత కాలం నాటి స్టైల్సే కదా ఆమెకి తెలిసింది.
అందుకే అప్పటి ఫ్యాషన్‌ని ఈ సినిమాలో చూపించారు. అదే ఫ్యాషన్‌తో సమంత ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. బ్రైట్ లుక్స్‌లో కనిపించి అదరగొట్టేస్తోంది. ఆ మాటికొస్తే, సమంత క్యూట్‌నెస్‌కి ఏ డ్రస్ వేసినా అందమే. ఇక వల్గారిటీకి చోటు లేకుండా పాత కాలం నాటి మోడ్రన్ దుస్తుల్లో ఎంత క్యూట్‌గా ఊరించేస్తోందో. సమంతను అలా చూస్తున్న ఫ్యాన్స్ ఇంకా పిచ్చెక్కిపోతున్నారు. మరికొద్ది గంటల్లోనే 'ఓ బేబీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల టైం దగ్గర పడేకొద్దీ, ఆడియన్స్‌లో 'ఓ బేబీ' ఉత్కంఠ మరీ పెంచేస్తోంది.