తెనాలి రామకృష్ణ పేరు వింటేనే పెదాలపై నవ్వులు పూస్తాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఆ పాత్ర ఔచిత్యం అలాంటిది. ఆ పేరునే సినిమా పేరుగా పెట్టి, టైటిల్ రోల్ పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరో సందీప్ కిషన్. 'తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్' సినిమాతో ఈ శుక్రవారం ధియేటర్‌లో నవ్వులు పూలు పూయిస్తానంటున్నాడీ యంగ్ హీరో. ఈ వారం విశాల్ సినిమా 'యాక్షన్' తప్ప, మరో చెప్పుకోదగ్గ సినిమా లేదు. సో యాక్షన్ థ్రిల్ కావాలనుకుంటే, 'యాక్షన్' మూవీనీ, హాయిగా ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటే 'తెనాలి రామకృష్ణ'నీ ఎంచుకునే ఆప్షన్ ఉంది. హీరోయిన్ హన్సిక ఉండడంతో, గ్లామర్‌కీ కొదవ లేదు.
ఇటీవల 'నిను వీడని నీడను నేనే' అంటూ కాన్సెప్ట్ బేస్‌డ్ మూవీతో వచ్చి హిట్ కొట్టాడు సందీప్ కిషన్. ఈ సినిమా కోసం కాలేజీలు, కాలనీలు అనే తేడా లేకుండా తిరిగి యూత్‌కి బాగా అలవాటైపోయాడు సందీప్ కిషన్. ఆ క్రేజ్ ఈ సినిమాకీ ఎంతో కొంత వర్కవుట్ అవ్వకుండా ఉండదనిపిస్తోంది. కామెడీ చిత్రాలకు పెట్టింది పేరయిన జి. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇటీవల పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా, రెడ్డి గారు ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలనే పట్టుదలతో పని చేశారు. ఆ పనితనం ఎంత మేర వర్కవుట్ అవుతుందో చూడాలి మరి. క్రేజీ భామ వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.