కంటెంట్ ఉంటే, కటౌట్‌తో సంబంధం లేదంటారు. అలా మంచి కంటెంట్‌తో వచ్చిన చిన్న సినిమాలు కూడా సంచలన విజయం అందుకున్న సందర్భాలు అనేకం చూశాం. అలా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘రాహు’ చిత్రం. చిన్న సినిమా అయినా ఆసక్తికరమైన కథాంశంతో రూపొందింది చిత్రం. ‘మనసులోని భయం చూపును కమ్మేస్తే దాన్ని హిస్టీరికల్ బ్లైండ్‌నెస్ అంటాం’ అనే ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో హీరోయిన్ హిస్టీరికల్ బ్లైండ్‌నెస్‌తో బాధపడుతుంటుంది.
రక్తం చూస్తే ఎవ్వరికైనా కళ్లు తిరుగుతాయి. కానీ, రక్తం చూస్తే ఈ సినిమాలో హీరోయిన్ ఊహించని విధంగా విచిత్రంగా రెస్పాండ్ అవుతుందట. మరి అలాంటి విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్న అమ్మాయికి విలన్ రూపంలో మరో భయం వెంటాడితే ఎలా ఉంటుంది.? తన మనసులోని భయాన్ని, విలన్ రూపంలో వచ్చిన భయాన్ని తట్టుకుని ఎలా జీవనం సాగిస్తుంది.? అనేదే ఈ సినిమా కథ. కథ ఆసక్తికరంగా ఉంది. బయటి నుండి బడా నిర్మాత సురేష్ బాబు సపోర్ట్ కూడా ఉంది. సురేష్ బాబు సమర్పణలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. హీరో, హీరోయిన్స్ కొత్త వాళ్లే అయినా, కథలోని కంటెంట్ ఆడియన్స్‌ని ధియేటర్స్‌కి రప్పించగలిగితే, ఈ చిన్న సినిమా సక్సెస్ అయినట్లే.
ఇక ఈ థ్ల్రిల్లర్ మూవీకి సుబ్బు వేదుల దర్శకుడు. కృతి గార్గ్, అభిరామ్ వర్మ జంటగా నటిస్తున్నారు. బాహుబలి ప్రభాకర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అన్నట్లు ఇదే రోజు భారీ అంచనాలతో విడుదల కానున్న నాని ‘హిట్’ మూవీతో ‘రాహు’ బాక్సాఫీస్ వద్ద పోటీ పడాల్సి ఉంది. ఈ పోటీని తట్టుకోవడం ‘రాహు’కి సాధ్యమా.? చూడాలిక.