‘సత్యాగ్రహి’ని మళ్లీ కెలుకుతున్న పవన్‌ కళ్యాణ్‌.!

మరిన్ని వార్తలు

చాలా కాలం క్రితం అనౌన్స్‌ చేసిన ప్రాజెక్ట్‌ ఇది. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా అనుకున్న ప్రాజెక్ట్‌ ఇది. అప్పట్లో ఈ సినిమాపై ఆసక్తికరమైన ప్రచారాలు అనేకం జరిగాయి. కానీ, అనౌన్స్‌మెంట్‌ దగ్గరే ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. ఒకానొక దశలో దివంగత ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు ఈ సినిమాని నిర్మించాలనుకున్నారు. కానీ అప్పుడూ కుదరలేదు. ఇప్పుడు మరో గ్రేట్‌ ప్రొడ్యూసర్‌ ఎ.ఎఎం రత్నం ‘సత్యాగ్రహి’ మీద ఆసక్తి చూపుతున్నారట. ప్రస్తుతం ఈయన పవన్‌ కళ్యాణ్‌తోనే సినిమా చేస్తున్నారు. క్రిష్‌ - పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా అది.

 

మొగల్‌ కాలం నాటి బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందిస్తున్నారు. ‘పింక్‌’ రీమేక్‌ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమాలో నటించనున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా తెరపైకి వచ్చిన ‘సత్యాగ్రహి’ ప్రాజెక్ట్‌తో పవన్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. 2024 ఎలక్షన్స్‌ ముందు సినిమా రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నాడట. అంటే అందుకు చాలానే టైమ్ ఉంది. 2020లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయట. అంతేకాదు, రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాని పకడ్బంధీగా టేకప్‌ చేయగల డైరెక్టర్‌ కోసం అన్వేషణ జరుగుతోంది. అన్నీ కుదిరి ఈ ప్రాజెక్ట్‌ కార్య రూపం దాల్చాలంటే ఫ్యాన్స్‌ చాలా కాలమే ఎదురు చూడాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS