నర్తనశాల, అశ్వద్ధామ... ఇలా వరుస పరాజయాలతో నాగశౌర్య డీలా పడ్డాడు. ఈ దశలో అవసరాల శ్రీనివాస్ సినిమాపైనే ఆశలు పెంచుకున్నాడు. అవసరాల దర్శకుడిగా మంచి ఫామ్ లో ఉన్నాడు. పైగా తాను తీసేవన్నీ క్లాస్ మూవీస్. అందుకే ఈ సినిమాతో నాగశౌర్యకి బ్రేక్ లభిస్తుందనుకుంటే... ఈ సినిమా ఆగిపోయిందన్న వార్త బయటకు వచ్చింది.
బడ్జెట్ సమస్య వల్ల అవసరాల శ్రీనివాస్ తో నాగశౌర్య సినిమా ఆగిపోయిందని, ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టారని గుసగుసలు వ్యాపించాయి. అయితే ఈ వార్తల్ని నిర్మాణ సంస్థ ఖండించింది. ఈ సినిమా ఆగిపోలేదని, ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే కొత్త షెడ్యూల్ని పట్టాలెక్కిస్తామని, అమెరికాలో ఈ సినిమా తీయాల్సి వచ్చిందని, అక్కడి వీసాలు దొరక్కపోవడం వల్ల చిత్రీకరణ ఆలస్యమైందని క్లారిటీ ఇచ్చాయి. సో... నాగశౌర్య సినిమా ఆగిపోలేదన్నమాట.