బిగ్‌బాస్‌ ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్‌లో ఏముందంటే.!

మరిన్ని వార్తలు

గత కొన్ని రోజులుగా బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచుతూ, రోజుకో రకం ట్విస్ట్‌ ఇస్తూ, ఆసక్తి రేపుతున్న బిగ్‌బాస్‌లో టాస్క్‌లతో పాటు, సీక్రెట్‌ టాస్క్‌లు కూడా లైన్‌లోకి వచ్చాయి. నిజానికి ఇప్పటికే కొన్ని సీక్రెట్‌ టాస్క్‌లు జరిగాయి. కానీ, అవేమీ అంత లెక్కల్లోకి రాలేదు. తాజాగా బిగ్‌బాస్‌ పునర్నవి, అలీ రెజాకి ఓ సీక్రెట్‌ టాస్క్‌ అప్పగించారు. బెడ్‌రూమ్‌ పక్కన ఉన్న ఓ డోర్‌ ఓపెన్‌ చేసి లోపలకు వెళితే, సీక్రెట్‌ టాస్క్‌కి సంబంధించిన ఓ సీక్రెట్‌ ప్లేస్‌ ఉందనీ, ఆ ప్లేస్‌లోకి హౌస్‌లోని వారంతా నిద్రపోయాక, ఎవరికీ తెలియకుండా రమ్మని బిగ్‌బాస్‌ సూచించారు.

 

అలాగే అలీ, పునర్నవి ఆ సీక్రెట్‌ ప్లేస్‌కి వెళ్లారు. అయితే, ముందుగానే ఈ సీక్రెట్‌ టాస్క్‌ గురించి బిగ్‌బాస్‌ ఈ ఇద్దరికీ వివరించారు. ఇది చాలా సాహసంతో కూడుకున్నదనీ, అస్సలు ఈజీ కాదనీ హెచ్చరించారు. మీరు చేయగలరా.? అని అనుమతి తీసుకున్నాకే వారికి ఈ టాస్క్‌ అప్పచెప్పారు. అయితే, టాస్క్‌లో ఏముందనేది మాత్రం తెలీదు కానీ, ఖచ్చితంగా ఈ టాస్క్‌ టఫ్‌ టాస్క్‌ అని మాత్రం తెలుస్తోంది.

 

ఇదిలా ఉంటే, హౌస్‌లోంచి సడెన్‌గా మాయమైపోయిన ఈ ఇద్దరు కుటుంబ సభ్యుల గురించి, మిగిలిన వారు తెల్లవారాకా లేచి చూసి ఆరా తీశారు. కానీ, ఫలితం లేదు. కొంత సేపు ఆరా పట్టి, తర్వాత లైట్‌ తీసుకున్నారు. కాసేపటికి, బిగ్‌బాస్‌ నుండి సంకేతాలొచ్చాయి. మిస్‌ అయిన ఇద్దరు సభ్యులు తిరిగి హౌస్‌లోకి రావాలని కోరుకుంటున్న వాళ్లెంతమంది అని అడిగారు. హిమజ, బాబా భాస్కర్‌ తప్ప, మిగిలిన వారందరూ వారిద్దరూ తిరిగి రావాలని కోరుకున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS