హిమజ ఇక్కడ మార్కులు కొట్టేసిందిగా!

మరిన్ని వార్తలు

డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ గాళ్‌ హిమజ ఈ సారి ఎలిమినేషన్‌ నుండి తప్పించుకోలేకపోయింది. గతంలో లక్కీగా నామినేషన్‌ నుండి తప్పించుకున్న హిమజ ఈ సారి కూడా తప్పించుకుంటుందనే ప్రచారం జరిగింది. నో ఎలిమినేషన్‌ అనే వార్త బయటికి వచ్చింది. కానీ, ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ అంటూ హోస్ట్‌ నాగ్‌ బిల్డప్‌ ఇస్తూ, శనివారం రాహుల్‌ని ఎలిమినేట్‌ చేశారు. అఫ్‌కోర్స్‌ ఇది ఫేక్‌ ఎలిమినేషన్‌ అనుకోండి. ఇక రియల్‌ ఎలిమినేషన్‌లో భాగంగా హిమజపై వేటు తప్పలేదు.

 

హౌస్‌ నుండి బయటికి వెళ్లేందుకు అన్ని రకాల అర్హతలున్న కంటెస్టెంట్‌గా హిమజ పేరు బయటి నుండీ, హౌస్‌ మేట్స్‌ అభిప్రాయాల నుండి ఎప్పటి నుండో వినిపిస్తున్న మాటే. ఎట్టకేలకు ఎలిమినేట్‌ అయ్యింది. హౌస్‌లో ఉన్నన్ని రోజులూ హిమజపై నెగిటివిటీ ప్రచారమే ఉంది. ఆమె విచిత్రమైన ఆటిట్యూడ్‌తో సమయం దొరికినప్పుడల్లా హౌస్‌మేట్స్‌ని ఇరిటేట్‌ చేస్తూనే ఉంది. ఆమె ఇరిటేషన్‌ తట్టుకోలేక హౌస్‌ మేట్స్‌ ఒకరితో ఒకరు ఆమె పట్ల తమ అభిప్రాయాలను బయట పెడుతూనే ఉన్నారు. వీక్షకుల దృష్టిలో కూడా హిమజపై అదే అభిప్రాయం ఉంది. అయితే, హౌస్‌ నుండి బయటికొచ్చిన హిమజ అనూహ్యమైన సమాధానంతో మార్కులు కొట్టేసింది. మళ్లీ అవకాశమొస్తే బిగ్‌ హౌస్‌లోకి వెళతావా? అని అందర్నీ అడిగే ప్రశ్నే హిమజను కూడా అడిగాడు హోస్ట్‌ నాగార్జున.

 

అయితే, అందరూ చెప్పే సమాధానం తప్పకుండా వెళతానని. కానీ, హిమజ మాత్రం సెపరేట్‌గా సమాధానం చెప్పింది. బిగ్‌బాస్‌ హౌస్‌ అనేది ఓ డ్రీమ్‌.. అద్భుతం. ఒక్కసారే ఆ అవకాశం రావాలి అంతే. సో నేనైతే మళ్లీ వెళ్లాలనుకోను.. అని చెప్పి క్లైమాక్స్‌లో ఆడియన్స్‌ మనసులు దోచేసింది. ఇంతవరకూ ఏ సీజన్‌లోనూ ఇలాంటి సమాధానం చెప్పిన కంటెస్టెంట్‌ ఎవ్వరూ లేరు. దటీజ్‌ డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ గాళ్‌ హిమజ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS