సీక్రెట్‌ టాస్క్‌: బిగ్‌ విలన్‌ హిమజ.!

మరిన్ని వార్తలు

మరోసారి హిమజ బిగ్‌హౌస్‌లో విలనిజం ప్రదర్శించింది. ఈ సారి విలన్‌గా మారాలని బిగ్‌బాసే హిమజకు సూచించాడు. సీక్రెట్‌ టాస్క్‌లో భాగంగా హిమజ విలన్‌గా మారాలని, కిచెన్‌ ప్రాపర్టీస్‌ని పాడు చేయాలని, హౌస్‌మేట్స్‌తో అనవసరంగా గొడవలు పెట్టుకోవాలనీ, హౌస్‌మేట్స్‌లోని కొందరి వస్తువులు దాచేయాలనీ, ఇంకొందరివి స్టోర్‌ రూమ్‌లో పెట్టేయాలనీ, లగ్జరీ బడ్జెట్‌ రానీయకుండా అడ్డుకోవాలనీ సూచించాడు.

 

ఈ సీక్రెట్‌ టాస్క్‌ని విజయవంతంగా నెరవేరిస్తే, ఆమెకు ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పాడు బిగ్‌బాస్‌. అయితే, ఆ సీక్రెట్‌ టాస్క్‌ని చేయడంలో హిమజ తనవంతు ప్రయత్నించింది కానీ, విఫలమైంది. కిచెన్‌లో ఆమ్లెట్‌ విషయమై గొడవ స్టార్ట్‌ చేసింది. ఎగ్స్‌ అన్నీ పగలగొట్టింది. హౌస్‌మేట్స్‌ కోపానికి గురైంది. అలీ ప్రొటీన్‌ పౌడర్‌ దాచేసింది. కానీ, లగ్జరీ బడ్జెట్‌ని అడ్డుకోవడంలో పూర్తిగా విపలమైంది. గతంలో నేచురల్‌గానే విలనిజం చూపించిన హిమజ ఎందుకో, సీక్రెట్‌ టాస్క్‌లో విలనిజాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది.

 

దాంతో ఇమ్యూనిటీ దక్కే అవకాశం కోల్పోయింది. ఇక ఈ వారం ఎలిమినేషన్స్‌లో హిమజ కూడా ఉంది. మరి, ఈ వారం హిమజను ఆడియన్స్‌ సేవ్‌ చేస్తారా.? లేదా.? తెలుసుకునే సమయం వీకెండ్‌ కూడా రానే వచ్చింది. ఈ రోజు కొందర్ని హోస్ట్‌ నాగార్జున సేవ్‌ చేస్తారు. ఆ లిస్టులో ఈ రోజు హిమజ పేరు ఉంటుందో లేదో తెలియాలంటే, స్టే ట్యూన్డ్‌. లెట్స్‌ వాచ్‌ బిగ్‌బాస్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS