రాములమ్మకి షాకిచ్చిన రెబల్‌ స్టార్‌.!

మరిన్ని వార్తలు

రాములమ్మ, రెబల్‌ స్టార్‌ అని మాట్లాడుకుంటున్నామేంటీ..? రెబల్‌స్టార్‌కీ, రాములమ్మకీ ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అయితే మీకీ విషయం ఖచ్చితంగా తెలియాల్సిందే. బుల్లితెరపై లేటెస్ట్‌గా బిగ్‌బాస్‌ రియాల్టీ షో స్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఈ షో రన్నింగ్‌లో ఉంది. ఈ రన్నింగ్‌ షోలో రెండో రోజు బిగ్‌హౌస్‌లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.

 

శ్రీముఖి, హిమజల మధ్య ఈ చిత్రం చోటు చేసుకుంది. ఇంతకీ ఏంటా చిత్రం అంటే, ఎలిమినేషన్‌ నామినేషన్‌ విషయమై శ్రీముఖి, హిమజ పేరు ప్రస్థావించింది. తన ప్లేస్‌లో హిమజను నామినేట్‌ చేసింది. కారణం చెప్పే క్రమంలో శ్రీముఖి, హిమజను లైఫ్‌ లైట్‌ తీసుకునే అమ్మాయి అంటూ టంగ్‌ స్లిప్‌ అయ్యింది. దాంతో నన్నే బ్లేమ్‌ చేస్తావా? ఇది చాలా తప్పుడు మాట అంటూ.. హిమజ రాములమ్మపై రెచ్చిపోయింది.

 

హిమజ ఆటిట్యూడ్‌కి పులిలాంటి రాములమ్మ పిల్లిలా మారిపోయింది. హిమజ అంటే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ, శ్రీముఖి అలా కాదు. బుల్లితెరపై బాగా పాపులర్‌. బోలెడంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అన్నింటికీ మించి శ్రీముఖి నోటికి భయపడనివారుంటారా.? చెప్పండి. అలాంటి శ్రీముఖి నోటికే తాళమేయించి, సారీ కూడా చెప్పించుకుంది హిమజ. బిగ్‌హౌస్‌లో రెండో రోజే హీటెక్కించిన ఈ ఇష్యూ బిగ్‌బాస్‌ షోపై మరింత ఆసక్తి కనబరిచేలా చేసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS