సిద్దార్ద్‌తో రకుల్‌ రొమాంటిక్‌ జిల్‌జిల్‌!

మరిన్ని వార్తలు

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తమిళంలో జాక్‌పాట్‌ కొట్టిందనే వార్తలు ఈ మధ్య వింటున్నాం. విశ్వనటుడు కమల్‌హాసన్‌ నటిస్తున్న 'ఇండియన్‌ 2'లో రకుల్‌ని ఎంచుకున్నారనే ముచ్చటది. అయితే, ఈ విషయమై ఫస్ట్‌టైమ్‌ రకుల్‌ స్పందించింది. 'ఇండియన్‌ 2' ఛాన్స్‌ నిజమేనని రకుల్‌ అఫీషియల్‌గా ఓపెన్‌ అయ్యింది. కమల్‌హాసన్‌తో నటించడం చాలా సంతోషంగా ఉందని రకుల్‌ చెప్పుకొచ్చింది. అయితే, రకుల్‌ ఈ సినిమాలో కమల్‌కి జోడీగా నటించడం లేదు. ఈ సినిమాలో మరో హీరో సిద్దార్ధ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

 

సిద్దార్ధ్‌కి లవర్‌గా రకుల్‌ నటిస్తోందట. ఈ పాత్ర చాలా హాట్‌గా కనిపించనుందట. సిద్దార్ద్‌, రకుల్‌ మధ్య రొమాంటిక్‌ సీన్లు ప్రేక్షకుల్ని రొమాంటిక్‌ మూడ్‌లోకి తీసుకెళ్లిపోతాయట. అసలే ఈ మధ్య రకుల్‌ విచ్చలవిడిగా స్కిన్‌ షో చేసేస్తోంది. హిందీలో నటించిన 'దే దే ప్యార్‌ దే' మూడ్‌లోంచి రకుల్‌ ఇంకా బయటికి రాలేకపోతోంది కాబోలు. అదే ఫ్లేవర్‌ని సౌత్‌ సినిమాలకూ ఆపాదించేస్తోంది. అయినా, రకుల్‌ ఏం చేస్తుందిలెండి. ఆమెకు వస్తున్న అవకాశాలు కూడా అలాంటివే వస్తున్నాయి మరి. తెలుగులో 'మన్మధుడు 2'లో నాగ్‌కి జోడీగా రకుల్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఈ సినిమాలో అవంతికగా రకుల్‌ ఏ స్థాయిలో గ్లామర్‌ పండించిందో టీజర్‌ ద్వారా చూసేశాం. ఇక తమిళంలో నటించబోయే 'ఇండియన్‌ 2'పై టాక్‌ ఇలా ఉంది. అసలే తమిళంలో రకుల్‌ కెరీర్‌ ట్రాక్‌ రికార్డు ఏమంత ఘనంగా లేదు. గతంలో రకుల్‌ నటించిన కార్తితో రెండు, సూర్యతో 'ఎన్జీకే' చిత్రాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో ఓ సినిమాలో నటిస్తోంది రకుల్‌. ఇక ఇప్పుడు తాజాగా వచ్చిన 'ఇండియన్‌ 2' పై మళ్లీ కొండంత ఆశలు నింపుకుంది రకుల్‌. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొడతానని కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS