'హిప్పీ' భామ మాస్‌.. ఊరమాస్‌!

By iQlikMovies - June 05, 2019 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

'హిప్పీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది ముద్దుగుమ్మ దిగంగనా సూర్యవంశీ. స్టార్‌ టీవీలో పలు సీరియల్స్‌లో నటించిన అనుభవం ఉంది ఈ ముద్దుగుమ్మకి. అలాగే 2015 బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గానూ ఈ భామ సుపరిచితురాలే. తెలుగులో కార్తికేయ సరసన 'హిప్పీ' చిత్రంలో ఛాన్స్‌ దక్కించుకుంది. హిందీలో ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, హీరోయిన్‌గా ఎంట్రీ తెలుగులోనే అని చెప్పాలేమో. సినిమాలో క్యూట్‌గా బాగా హాట్‌గా కనిపించింది. ఈ సినిమా రేపు అనగా జూన్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

 

ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రమోషన్స్‌లో దిగంగనా ట్రెడిషనల్‌ వేర్‌లో దర్శనమిస్తోంది. అంతేకాదు, సినిమాలోని డైలాగులు, డాన్సులతో ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. డాన్సుల్లో మంచి గ్రేస్‌ ఉంది అమ్మడిలో. స్టేజ్‌పై అవలీలగా డాన్స్‌ చేస్తోంది. మాస్‌, ఊరమాస్‌ స్టెప్పులతో ఆకట్టుకుంటోంది. ఒకవేళ సినిమా హిట్‌ అయితే, అమ్మడికి మంచి పేరు రావడంతో పాటు, ఆడియన్స్‌కి ఈ బ్యూటీ ఫేస్‌ రిజిస్టర్‌ అయిపోతుందనడం అతిశయోక్తి కాదు. టి.ఎన్‌.సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని కలైపులి ఎస్‌, థాను నిర్మిస్తున్నారు. సీనియర్‌ నటుడు జె.డి.చక్రవర్తి కీలక పాత్రలో నటిస్తుండగా, వెన్నెల కిషోర్‌ మరో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్నాడు. దిగంగనాతో పాటు, జజ్బాసింగ్‌ మరో హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS