'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌లోకి అల్లూరి వచ్చేస్తున్నాడు!

మరిన్ని వార్తలు

చరణ్‌, ఎన్టీఆర్‌కి గాయాల కారణంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌ వాయిదా పడింది. మూడు వారాల గ్యాప్‌ కాస్తా ఎక్కువే గ్యాప్‌ అయ్యింది. ఈ లోగా చరణ్‌, భార్య ఉపాసనతో కలిసి వెకేషన్‌ ఎంజాయ్‌ చేశాడు. వెకేషన్‌ నుండి తిరిగొచ్చిన చరణ్‌, నెక్స్‌ట్‌ వీక్‌ నుండి షూటింగ్‌లో పాల్గొననున్నాడనీ తాజాగా అందుతోన్న సమాచారమ్‌. చరణ్‌ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్‌ విషయానికి వస్తే, చేతికి గాయంతో బాధపడుతున్నాడు ఎన్టీఆర్‌.

 

ఎన్టీఆర్‌ గాయం కూడా మానడంతో త్వరలోనే షూటింగ్‌లో జాయిన్‌ అవ్వనున్నాడనీ తెలుస్తోంది. ఇటీవల తాత ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లోనూ ఎన్టీఆర్‌ చేతికి బ్యాండేజ్‌తోనే కనిపించాడు. ఇదిలా ఉంటే, సైలెంట్‌గా 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌ జరిగిపోతోందనే వినికిడి ఉంది. మెయిన్‌ స్టార్స్‌ ఎన్టీఆర్‌, చరణ్‌లు గాయాలతో బాధపడుతున్న కారణంగా, వారిని పక్కన పెట్టి, మిగిలిన ఆర్టిస్టులతో రాజమౌళి షూటింగ్‌ పూర్తి చేస్తున్నాడనే టాక్‌ వినిపిస్తోంది. అందరూ అనుకుంటున్నట్లుగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌కి జక్కన్న బ్రేక్‌ ఇవ్వలేదట. మిగిలిన సపోర్టింగ్‌ రోల్స్‌తో వచ్చే సన్నివేశాల్ని చిత్రీకరించేశాడట ఈ లోగా.

 

షూటింగ్‌ వాయిదా పడడంతో అనుకున్న టైంకి సినిమా విడుదల జరగదని ప్రచారం జరిగింది. కానీ ఆ అనుమానాలేం లేకుండా, జక్కన్న ఇలా సైలెంట్‌గా షూటింగ్‌ కానిచ్చేశాడనీ తెలుస్తోంది. ఇక త్వరలోనే షూటింగ్‌లో జాయిన్‌ కానున్న ఎన్టీఆర్‌, చరణ్‌ల కోసం హైద్రాబాద్‌ శివార్లలో ఓ భారీ సెట్‌ నిర్మించారట. వన్స్‌ సెట్‌లో అడుగుపెట్టడమే తరువాయి, ఫాస్ట్‌ ఫాస్ట్‌గా ఈ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేయనున్నారట జక్కన్న అండ్‌ టీమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS