అడివి శేష్ మంచి ఫామ్ లో వున్నాడు. మేజర్ తో పాన్ ఇండియా గుర్తింపు కూడా వచ్చింది. ఇప్పుడు హిట్ 2 తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే విడుదలకు ముందే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్ళింది. తెలుగు రాష్ట్రాలలో హిట్2 బ్రేక్‌ఈవెన్ 10 కోట్లని తెలిసింది. సేఫ్ ప్రాజెక్ట్ గా మారడానికి వరల్డ్ వైడ్ గా 14.5 కోట్ల షేర్ వసూలు చేయాల్సివుంటుంది.
ఈ సినిమాపై వున్న హైప్ చూస్తుంటే బ్రేక్ ఈవెన్ నెంబర్ తక్కువగా ఉందనే చెప్పాలి. మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్‌ఈవెన్‌ని చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ చాలా క్యురియాసిటీ పెంచింది. ఖచ్చితంగా సినిమా థియేటర్లో చూడాలనే ఆసక్తిని కలిగించింది.
రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్స్ కి రావడం అందరినీ ఆకర్షించారు. హీరో నాని బాక్ బోన్ గా వున్నాడు. దీంతో బయ్యర్స్ కి ఈ సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఇక నిర్మాతలకు నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో అదిరిపోయే ఆఫర్లు కూడా వున్నాయి.