HIT 2 Review: హిట్ 2 మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: అడివి శేష్, మీనాక్షి, రావు రమేష్, కోమలి ప్రసాద్ర్
దర్శకుడు : డా. శైలేష్ కొలను
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
సంగీత దర్శకులు: ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: ఎస్.మణికందన్
ఎడిటర్: గ్యారీ Bh


రేటింగ్ : 3/5


కథానాయ‌కుడిగానే కాదు.. నిర్మాత‌గానూ తన అభిరుచిని చాటారు నాని. కొత్త కొత్త క‌థ‌ల్ని ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఆయ‌న నిర్మించిన తొలి చిత్రం ‘అ!’ అందరి ప్రసంశల్ని అనుకుంది. రెండో ప్రయ‌త్నంగా విశ్వక్‌సేన్ తో చేసిన చేసిన ‘హిట్’ సినిమా కూడా ఆకట్టుకుంది. అదే జోష్ తో దర్శకుడు శైలేష్ కొల‌ను దాన్ని ఒక ఫ్రాంచైజీగా మార్చి అడివి శేష్ కథానాయకుడిగా 'HIT ది సెకండ్ కేస్' ని తీసుకొచ్చారు. ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాలు రేపింది ? కిల్లర్ ఎవరు అని తెలుసుకోవాలనే క్యురియాసిటీ ని పెంచింది? ఆ కిల్లర్ కథలోకి వెళితే...


కథ :


కృష్ణదేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్ ) విశాఖ‌ప‌ట్నం ఎస్పీగా విధుల్లో చేర‌తాడు. క్రిమిన‌ల్స్‌వి క్షణాల్లో పట్టుకోవడం అతడి స్పెషాలిటీ. కిమినల్స్ వి కోడి బుర్రలనీ, వాళ్లని ప‌ట్టుకోవ‌డం పెద్ద క‌ష్టమేమీ కాద‌ని ఆతని నమ్మకం. విశాఖ‌లోని ఓ ప‌బ్‌లో సంజన అనే అమ్మాయి దారుణ హ‌త్యకి గుర‌వుతుంది. చేతులు, కాళ్లూ, మొండెం అన్నీ వేరు చేసి.. దారుణ స్థితిలో ఉన్న ఆ అమ్మాయి మృత‌దేహాన్ని చూసిన కేడీకి.. ప‌రిశోధ‌న‌లో మ‌రో షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ కాళ్లూ చేతులు, మొండెం ఒక‌రివి కాదు.. మొత్తం న‌లుగురు అమ్మాయిలు హ‌త్యకి గుర‌య్యారనే సంగతి తెలుస్తుంది. అప్పుడు కేడీ ఏం చేశాడు ? కిల్లర్ ని ఎలా పట్టుకున్నాడు ? విచారణలో అతనికి ఎదురైన సవాల్ ఏంటి ? అనేది తెరపై చూడాలి.


విశ్లేషణ :


ఇదో ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి సినిమాల్లో ఓ క్రూర‌మైన హ‌త్య , దాని చుట్టూ కొందరు వ్యక్తులు, కొన్ని ప్రశ్నలు, పోలీస్ అధికారి విచారణ.. దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఇదే ఫార్ములా హిట్ 2లోనూ వుంటుంది. క్రిమినల్స్‌ని చాలా సుల‌భంగా పట్టేసే కేడీ పాత్రతో అడ‌వి శేష్ ప‌రిచ‌యం, ప‌బ్‌లో జ‌రిగిన అమ్మాయి హ‌త్య, ఒక అమ్మాయి కాదు న‌లుగుర‌మ్మాయిలు హ‌త్యకి గుర‌య్యార‌ని తెలియడం ఆసక్తికరంగా వుంటాయి. అయితే దిని తర్వాత మొదలయ్యే విచారణ లో మాత్రం వేగం కనిపించదు. ఈ కేసులో కేడీ పట్టుకునే వీరరాఘవుడు ఎపిసోడ్ కథ లో కలసి రాలేదు. ఆ పాత్రని వాడుకున్న తీరు గ్రిప్పింగ్ గా లేకపోగా ,, విచారణని మళ్ళీ మొదటి నుండి మొదలుపెట్టేలా వెనక్కి తీసుకెళ్లింది. అసలు కథలో మెయిన్ పాయింట్ మొదలు కాకుండానే విరామం పడిపోతుంది.


ద్వితీయార్ధంలో చాలా వరకూ విచారణకే కేటాయించారు. ఇలాంటి కతఃల్లో సైకో, పోలీసు మధ్య మైండ్ గేమ్ చాలా కీలకం. కానీ ఇందులో అలాంటి మైండ్ గేమ్ కనిపించదు. పైగా ఎంతో తెలివిపరుడైన కేడీ, సైకో ఇచ్చే క్లూస్ పైనే ఆధారాపడతాడు తప్పితే తన తెలివితో విచారణ చేపట్టినట్టు కనిపించపోవడం ప్రధాన మైనస్. ఇక సైకో ని రివిల్ చేసిన విధానం కూడా అంత గొప్పగా వుండదు. సైకో నేపధ్యం చెప్పుకోవడం, చివరికి అతడి పాత్రని ముగించడం రొటీన్ గానే వుంటుంది


నటీనటులు :


అడివి శేష్ ఇలాంటి పాత్రలు అలావాటే. కేడీ పాత్రలో ఒదిగిపోయాడు. శేష్ బాడీ లాంగ్వేజ్ స్టయిల్ గరిష్ ఫుల్ గా వున్నాయి. తన పాత్రలో మంచి ఫన్ కూడా వుంటుంది.


మీనాక్షి చౌద‌రి రొమాంటిక్ గా కనిపించింది. కోమ‌లి ప్రసాద్‌ కి మంచి పాత్ర దక్కింది. రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ల భ‌ర‌ణి పరిధి మేర చేశారు


టెక్నికల్ :


వాల్ పోస్టర్ సినిమా నిర్మాణ విలువలు నాణ్యంగా వున్నాయి .మణి కందన్ కెమెరాపని తనం ఆకట్టుకుంటుంది. సురేష్ బొబ్బిలి నేపధ్య సంగీతం థ్రిల్లర్ మూడ్ కి సరిపోయింది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ఫ్ గా ఉండాల్సింది.


దర్శకుడు థ్రిల్లర్ కి సరిపడా కథని రాసుకున్నాడు. అయితే దాన్ని ప్రజంట్ చేసిన తీరు మాత్రం రొటీన్ గా అనిపించింది.


ప్లస్ పాయింట్స్ :


అడవి శేష్
కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్
నిర్మాణ విలువలు


మైనస్ పాయింట్స్


మలుపులు లేకపోవడం
సైకో నేపధ్యం


ఫైనల్ వర్డిక్ట్ : మళ్ళీ హిట్టే..!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS