'హిట్ 1', 'హిట్ 2' రెండూ సూపర్ హిట్టయ్యాయి. ఈ ఫ్రాంచైజీని మంచి బిగినింగ్ ఇచ్చాయి. తెలుగులో ఫ్రాంచైజీ సినిమాల విజయాల శాతం చాలా తక్కువ. అయితే... హిట్ మాత్రం.. దూసుకుపోతోంది. హిట్ 3కి అప్పుడే అంకురార్పణ కూడా జరిగిపోయింది. హిట్ 2 క్లైమాక్స్ లో హిట్ 3 హీరో ఎవరో రివీల్ చేసేశారు. నానిని హీరోగా చూపిస్తూ... కథని ముగించారు. సో.. హిట్ 3 హీరో విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మరో ట్విస్టు ఏమిటంటే.. హిట్ 3లో మరో ఇద్దరు హీరోలు కూడా కనిపించబోతున్నారు. వాళ్లే... విశ్వక్ సేన్, అడవిశేష్.
'హిట్ 1'లో విశ్వక్, 'హిట్ 2'లో అడవి శేష్ హీరోలుగా నటించిన సంగతి తెలిసింందే. 'హిట్ 3'లో వారిద్దరూ కనిపించనున్నారని సమాచారం. హిట్ 2లో అక్కడక్కడ విశ్వక్ సేన్ ఫైల్ షాట్స్ పడ్డాయి. అంతే తప్ప... 'హిట్ 2'లో విశ్వక్ నటిచంలేదు. పార్ట్ 3 అలా కాదు.. ఇందులో ఇద్దరి హీరోలకూ సెపరేట్ స్క్రీన్ స్పేస్ ఉంది. నిజానికి హిట్ 3కి కొంత గ్యాప్ తీసుకొందామనుకొన్నాడు నాని. కానీ.. హిట్ 2 పెద్ద హిట్టయిపోవడంతో, ఇదే వేడిలో పార్ట్ 3 కూడా తీసేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కథ కూడా వేడి వేడిగా వండేస్తున్నారని సమాచారం.