డీసెంట్‌గా ‘హిట్‌’ స్నీక్‌ పీక్‌.!

By Inkmantra - February 25, 2020 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

ఈ నెల 28న ‘హిట్‌’ మూవీ ధియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ‘హిట్‌’ మూవీ రేంజ్‌ని ఎక్కడికో తీసుకెళ్లిపోగా, లేటెస్ట్‌గా ఈ సినిమా నుండి స్నీక్‌ పీక్‌ పేరుతో ఓ వీడియో రిలీజ్‌ చేశారు. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో రిలీజ్‌ చేసిన ఈ స్నీక్‌ పీక్‌, క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఓ డెడ్‌ బాడీని వెతికే ప్రక్రియను చాలా డీసెంట్‌గా చూపించారు. కంటిన్యూస్‌ ఫుల్‌ సీన్‌గా రిలీజ్‌ చేసిన ఈ వీడియోలో హీరో విశ్వక్‌సేన్‌ నటన హైలైట్‌ అని చెప్పాలి.

పోలీసాఫీసర్‌గా విశ్వక్‌ పండిరచిన హావభావాల, ఆహార్యం, డెబ్యూ డైరెక్టర్‌ శైలేష్‌ కొలను టేకింగ్‌ స్కిల్స్‌ ఆకట్టుకుoటున్నాయి. శాంపిల్‌గా వదిలిన ఈ సీన్‌ ఆధ్యంతం కట్టి పడేస్తోంది. చాలా సహజ సిద్ధంగా తెరకెక్కించిన ఈ సన్నివేశంలో డైరెక్టర్‌ ప్రామిసింగ్‌ స్క్రీన్‌ప్లే మైమరిపిస్తోంది. సినిమాపై ఎంత కాన్ఫిడెన్స్‌ ఉంటే, ఒక ఫుల్‌ సీన్‌ని ఇలా రిలీజ్‌ చేసేస్తారు.. చెప్పండి. సో టైటిల్‌కి తగ్గట్లే ఈ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ ‘హిట్‌’ అవుతుందనిపిస్తోంది. అయితే, సినిమా మొత్తం ఇదే గ్రిప్పింగ్‌ని డైరెక్టర్‌ కంటిన్యూ చేశాడా.? లేదా.? తెలియాంటే, వాల్‌ పోస్టర్‌ బ్యానర్‌లో హీరో నాని రూపొందించిన ‘హిట్‌’ మూవీ చూడాల్సిందే. ‘చిలసౌ’ బ్యూటీ రుహానీ శర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS