ప్రబాస్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌!

మరిన్ని వార్తలు

బాహుబలి సిరీస్‌ తర్వాత ప్రబాస్‌ నుండి వచ్చిన ‘సాహో’ మూవీ ఫ్యాన్స్‌ని దారుణంగా నిరాశపరిచింది. ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపాలంటే, ప్రబాస్‌కి ఓ మాంచి మాస్‌ మసాలా హిట్‌ పడాల్సిందే. కానీ, ఎప్పుడు.? ఎలా.? అంటే, త్వరలోనే ఆ ముచ్చట తీరబోతోందంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ప్రస్తుతం ‘జాన్‌’ సినిమాలో నటిస్తున్న ప్రబాస్‌, ఈ సినిమా పూర్తి కాగానే ఓ మాస్‌ డైరెక్టర్‌తో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడట. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్‌ కూడా ఫాస్ట్‌గా జరుగుతోందట ఈ సినిమాకి. ప్రబాస్‌ తొలి చిత్రం ‘ఈశ్వర్‌’, పూరీ కాంబినేషన్‌లో వచ్చిన ‘బుజ్జిగాడు’ తదితర చిత్రాల మాస్‌ ఇమేజ్‌ని ప్రబాస్‌ తిరిగి దక్కించుకునే సినిమా అవుతుందని ఈ సినిమా గురించి అప్పుడే గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అయితే, ప్రస్తుతానికి ఆ సినిమా గురించిన వివరాలు సస్పెన్స్‌గా ఉంచారు.

 

ఫ్యాన్స్‌లో మునుపటి ఉత్సాహం నింపాలంటే, త్వరలోనే ఆ వివరాలు తెలియాల్సిందే. అతి త్వరలోనే పూర్తి వివరాలతో ఆ సినిమా ముచ్చటను రివీల్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఇకపోతే, తాజా చిత్రం ‘జాన్‌’కి సంబంధించి టీజర్‌ని ఉగాదికి రిలీజ్‌ చేసే యోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యేలా ఈ టీజర్‌ ట్రీట్‌ ఉండనుందని ఊరిస్తున్నారు. చూడాలి మరి, ఈ ఊరింపు నిజమా.? కాదా.? అనేది ఆ టీజర్‌ ఏదో రిలీజయ్యాకా, ఫ్యాన్స్‌ రెస్పాన్స్‌ని బట్టి ఉంటుంది. ఇక ఈ సినిమా కోసం బుట్టబొమ్మ పూజా హెగ్దే తొలిసారి ప్రబాస్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటోంది. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ ఈ సినిమాకి దర్శకుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS