ఆర్గానిక్ ఫార్మేషన్ అనే ఓ మంచి సందేశం నేపథ్యంలో వచ్చిన ‘భీష్మ’ సినిమాలో హీరో మీమ్స్ చేస్తుంటాడన్న సంగతి తెలిసిందే. నితిన్ `రష్మికా మండన్నా' జంటగా ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే రిలీజై సూపర్ హిట్ కూడా అందుకుంది. ఇది రీల్ కథ. ఇప్పుడు రియల్ కథలోకి వచ్చేద్దాం. వివరాల్లోకి వెళితే, హీరోయిన్ రష్మికపై కొన్ని మీమ్స్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళ సూపర్ కమెడియన్ వడివేలుతో పోల్చుతూ రష్మికపై కొన్ని మీమ్స్ నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. అందులో భాగంగా రష్మిక ఫోటోనీ, వడివేలు ఫోటోనీ పక్క పక్కన పెట్టి వీరిద్దరిలో ఎవరు క్యూట్..? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘నో డౌట్.. హి ఈజ్ సో క్యూట్..’ అని వడివేలును అభివర్ణిస్తూ రష్మిక ట్వీట్ చేసింది.
I can’t agree more. 🐒 Vadivelu sir is soooo cuteeee♥😍https://t.co/zeO5EuzvPr
— Rashmika Mandanna (@iamRashmika) February 24, 2020
ఈ ట్వీట్‌తో రష్మిక క్రేజ్ మరింత పెరిగిపోయింది. అసలే రష్మిక సో బ్రిలియంట్. మంచి మాటకారి. అలాంటిది రష్మికతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. సదరు నెటిజన్‌కి మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. అనేట్లుగా రష్మిక నుండి కౌంటర్ పడిరది. అయితే, ఇక్కడ గమనించాల్సిందేమంటే, నిజమే రష్మిక క్యూటే కాదు, చాలా స్పోర్టివ్ కూడా. తనను ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేసిన నెటిజన్‌కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చి తన వ్యేూనీ, ఇమేజ్‌నీ నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. నిజంగా రష్మికను ఈ విషయంలో మెచ్చుకుని తీరాల్సిందే. ప్రస్తుతం బన్నీ ` సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. మార్చి నుండి ఈ సినిమా సెట్స్ మీదికెళ్లనుంది.