'ఆర్‌ఆర్‌ఆర్‌'.. డైసీ స్థానంలో ఎవరంటే..!

మరిన్ని వార్తలు

రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో విదేశీ భామ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ ఒక హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కి జోడీగా ఈ ముద్దుగుమ్మని ఎంచుకున్నారు. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల డైసీ ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నట్లు చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడా స్థానాన్ని ఫుల్‌ ఫిల్‌ చేసే హీరోయిన్‌ కోసం మళ్లీ రాజమౌళి అండ్‌ టీమ్‌ కసరత్తులు చేస్తోంది. 

 

 

హాలీవుడ్‌ నుండే ఈ ముద్దుగుమ్మని తీసుకురావాలని చిత్రయూనిట్‌ భావిస్తోందట. సినిమాపై అంచనాలు పెరిగేందుకు హీరోయిన్‌ లిస్టులో విదేశీ భామ పేరు కూడా ఓ కారణమే. సో ఆ అంచనాల్ని అలాగే ఉంచాలంటే తర్వాత ఎంచుకోబోయే హీరోయిన్‌ని కూడా హాలీవుడ్‌ నుండే తీసుకురావాలి. ఆ హాలీవుడ్‌ భామ ఎవరై ఉంటారనే ఉత్కంఠ మళ్లీ ఆడియన్స్‌లో నెలకొంది. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అలియాభట్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

ఇటీవల చరణ్‌ కాలికి గాయం కారణంగా షూటింగ్‌ మూడు వారాలపాటు వాయిదా వేశారు. ఇప్పుడు జరిగే ఈ షూటింగ్‌ షెడ్యూల్‌ చాలా లాంగ్‌ షెడ్యూల్‌ కావడం, ఈ షెడ్యూల్‌లో హీరోయిన్లు కూడా పాల్గొనాల్సి రావడం, అనుకోకుండా షూటింగ్‌ వాయిదా పడడంతో, డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడం వల్లే డైసీ ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకుందనే సమాచారమ్‌ అందుతోంది. ఏది ఏమైనా మరోసారి 'ఆర్‌ఆర్‌ఆర్‌' హీరోయిన్‌ టాపిక్‌ హాట్‌ టాపిక్‌ అయ్యిందిప్పుడు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS