రామ్‌గోపాల్‌ వర్మ కొత్త అవతారం చూశారా.?

By Inkmantra - April 08, 2019 - 09:29 AM IST

మరిన్ని వార్తలు

సంచలనాలకే సంచలనం రామ్‌గోపాల్‌ వర్మ. ఎన్ని రకాలుగా పబ్లిసిటీ స్టంట్స్‌ చేయాలో ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. అలాంటి రామ్‌గోపాల్‌ వర్మ ఇప్పుడేం చేయబోతున్నారో తెలుసా.? ఇంతవరకూ చేయనిది.? అదే నటన. అవునండీ నిజమే. రామ్‌గోపాల్‌ వర్మ నటుడిగా మారారు. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'కోబ్రా' సినిమాలో రామ్‌గోపాల్‌ వర్మ నటిస్తున్నారు. లేటెస్ట్‌గా 'కోబ్రా' ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఇంతకీ రామ్‌గోపాల్‌ వర్మ ఏ పాత్రలో నటిస్తున్నారనేదే కదా మీ డౌట్‌. 

 

ఆయనకి బాగా ఇష్టమైన మాఫియా డాన్‌ క్యారెక్టరే. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ బయోపిక్‌ అని ఈ సినిమాని ప్రకటించారు వర్మ. 'కోబ్రా' అని సినిమాకి టైటిల్‌ పెట్టారు. ఇంతకీ ఆ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ కోబ్రా వర్మనేనా.? అనే అనుమానాలుండొచ్చు. వస్తూ వస్తూనే విలన్‌గా వర్మ తెరంగేట్రం చేస్తున్నారేమో అనుకోవచ్చు. కానీ వర్మ ఈ సినిమాలో మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ పాత్రను కేజీ అనే హీరో పోషిస్తున్నాడు. 

 

'నీ శత్రువుని చంపటానికి నువ్వు ఓ పాముని వినియోగిస్తే, ఎప్పుడో ఒకప్పుడు ఆ పాము నిన్నే కాటేసి చంపేస్తుంది..' అనే ఓ క్యాప్షన్‌ని ఆ పోస్టర్‌పై ఆవిష్కరించారు వర్మ. పోస్టర్‌పై ఓ చేతిలో సిగరెట్‌, ఇకో చేతిలో గన్‌తో వర్మ ఎప్పటిలాగే స్టైలిష్‌గానే కనిపిస్తున్నారు. ఆయనతో పాటు, 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'తో దర్శకుడిగా పరిచయమైన అగస్త్య మంజు కూడా ఈ సినిమా డైరెక్షన్‌లోనూ భాగం పంచుకుంటున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. చూడాలి మరి వర్మ తెరంగేట్రం మూవీ ఇంకెన్ని కొత్త వివాదాలకు తావిస్తుందో. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS