#RRR టీమ్‌కి గట్టి షాక్ తలిగింది. సూపర్ ఫాస్ట్‌గా సాగిపోతున్న ఈ సినిమా షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. మూడు వారాల పాటు షూటింగ్ వాయిదా కూడా వేశారు. కారణం.. రామ్‌చరణ్‌కి అనుకోకుండా గాయం అవ్వడమే. ఈ సినిమా కోసం చరణ్ తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నాడు. జిమ్‌లో కండలు పెంచుతున్నాడు. అందులో భాగంగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న చరణ్‌కి స్వల్ప గాయాలయ్యాయని చిత్రబృందం ప్రకటించించింది.
We regret to mention that #RamCharan confronted a minor ankle injury while working out at the gym, yesterday. The pune schedule has been called off. Back to action in 3 weeks! #RRR
— RRR Movie (@RRRMovie) April 3, 2019
కాలు (చీలమండ) నొప్పితో చరణ్ బాధ పడుతున్నాడని..... అందువల్లనే మూడు వారాల పాటు షూటింగ్ నిలిపి వేస్తున్నట్టు చిత్రబృందం ట్విట్టర్లో పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం పూణెలో షూటింగ్ జరగాల్సింది. చరణ్ గాయం కారణంగా ఇప్పుడు ఆ షెడ్యూల్ కాన్సిల్ అయ్యింది. 2020 జులై 30న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. సడన్‌గా మూడు వారాలు ఈ సినిమా షూటింగ్‌కి అవరోధం ఏర్పడింది. మరి.. అనుకున్న సమయానికి సినిమాని విడుదల చేస్తారో లేదో..?