దిశాపటానీ అందమే కాదు, అంతకుమించి.!

మరిన్ని వార్తలు

మామూలుగా హాట్‌ హాట్‌ ఫోటోసే పోస్ట్‌ చేస్తుంటుంది హాట్‌ భామ దిశా పటానీ. ఈ విషయమై చాలా మంది ఆమెను ట్రాలింగ్‌ చేస్తుంటారు. మోడలింగ్‌ రంగం నుండి వచ్చిన దిశాపటానీ ఫ్యాషన్‌ పేరుతో తన ప్రొఫిషన్‌ని కొనసాగించడం తప్పు పట్టలేం. కాల్విన్‌ క్లెయిన్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా పని చేస్తోంది కాబట్టి ఆ బ్రాండ్‌ని ప్రమోట్‌ చేస్తుంటుంది. ఇన్నర్‌ వేర్‌లో ఆమె అందాలారబోతకు ఫ్యాన్స్‌ కూడా అలాగే ఉన్నారు మరి. 

 

అయితే ఆ సంగతి అటుంచితే దిశా పటానీ బేసిగ్గా చాలా హార్ట్‌ వర్కర్‌. కష్టపడి డాన్సులు చేయడంలో కానీ, సాహసోపేతమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చేయడంలో కానీ దిశా ది బెస్ట్‌. నిజానికి ప్రమాదకరమైన ఫీట్స్‌ చేయాల్సిన అవసరం దిశాపటానీకి లేదు. కానీ చేస్తుంటుంది. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది. అమ్మాయిల్లో ఇన్స్‌స్ప్రేషన్‌ కలిగించడానికే ఈ వీడియోలు పోస్ట్‌ చేస్తాననీ చెబుతుంటుంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Holi got me like🤪

A post shared by disha patani (paatni) (@dishapatani) on

 

లేటెస్ట్‌గా దిశా పోస్ట్‌ చేసిన వీడియో 15 లక్షల మంది చూశారు. ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్‌ వ్యూస్‌ ఇవి. ఒంటి చేతి మీద దిశా చేసిన ఈ తాజా ఫీట్‌కి ఫిదా అయిపోతున్నారంతా. అవును దిశాలో అందమే కాదు, అంతకుమించిన టాలంట్‌ ఉంది. ఒప్పుకుని తీరాల్సిందే అది. అందుకే ఆమెకు సోషల్‌ మీడియాలో దాదాపు కోటీ 80 లక్షల (18.5 మిలియన్లు) మంది ఫాలోవర్స్‌ ఉన్నారు . మామూలు విషయం కాదిది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS