తొలి సినిమాకే విచ్చలవిడి గ్లామర్ ఒలకబోసి, కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేసిన హాటెస్ట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కి బంపర్ ఛాన్స్ దక్కింది. అయితే ఈ ఛాన్స్‌ని బంపర్ ఛాన్స్ అనాలా.? వద్దా.? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. వర్ధమాన భామలకు క్రేజున్న యంగ్ హీరోల సరసన నటిస్తే వచ్చే కిక్కే వేరప్పా. కానీ పాయల్‌కేమో స్టార్ హీరోలు, అఫ్‌కోర్స్ సీనియర్ హీరోల సరసన వరుస ఛాన్సులొస్తున్నాయి.
ఆల్రెడీ రవితేజతో 'డిస్కోరాజా' సినిమాలో నటిస్తోన్న పాయల్, వెంకీ సరసన 'వెంకీ మామ'లో జోడీ కడుతోన్న సంగతి తెలిసిందే. 'మన్మధుడు 2'కి కూడా పాయలే హీరోయిన్ అనుకున్నారు కానీ, కుదరలేదు. తాజాగా బాలయ్య సరసన హీరోయిన్‌గా పాయల్ సెట్ అయ్యింది. ఎ.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్‌ని ఎంచుకున్నారట. ఈ ఛాన్స్ ఆమెను సంతృప్తి పరిచేదో లేక బాధించేదో అర్ధం కావడం లేదు. ఒక్క యంగ్ హీరో కూడా పాయల్ వైపు కన్నెత్తైనా చూడడం లేదెందుకో. తొలి సినిమాతో వచ్చిన క్రేజ్‌ని కంటిన్యూ చేయాలంటే, వచ్చిన ఏ అవకాశాన్ని అయినా అంది పుచ్చుకోవాలి తప్పదు. ప్రస్తుతం అదే చేస్తోంది పాయల్.
మరోవైపు 'ఆర్‌ఎక్స్ 100' ఇచ్చిన కిక్‌తో అమ్మడిపై 'ఆర్ డీ ఎక్స్' అనే పవర్‌ఫుల్ కాన్సెప్ట్‌ని హీరోయిన్ సెంట్రిక్ మూవీగా రూపొందించాలని ఓ టీమ్ భావించింది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది కూడా. అయితే, ఎందుకో కాస్త లేట్ అవుతోంది. ఈ సిట్యువేషన్‌లో దొరికిన అవకాశాన్ని అందుకుని, కెరీర్‌లో బిజీగా గడపాలన్నదే పాయల్ రాజ్‌పుత్ అభిప్రాయమేమో. అందుకే సీనియర్ హీరోలతో చిందేయడానికైనా పాయల్ ఓకే చెప్పేస్తోంది. ఇకపోతే బాలయ్య సరసన 'ఎన్టీఆర్' బయోపిక్‌లోనూ పాయల్ గెస్ట్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.