గ్లామరే కాదు, 'జెర్సీ' భామ యాక్షన్‌ కూడా!

By iQlikMovies - May 15, 2019 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

తమిళంలో విశాల్‌ సరసన 'అభిమన్యుడు 2' సినిమాలో శ్రద్ధా శ్రీనాధ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రద్ధా పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించనుందనీ తెలుస్తోంది. ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. పోలీస్‌ స్టేషన్‌ నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. పోలీసాఫీసర్‌గా శ్రద్ధా శ్రీనాధ్‌ కొన్ని క్రిటికల్‌ యాక్షన్‌ సీన్స్‌లో నటిస్తోందట. విశాల్‌ మిలిటరీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.

 

'అభిమన్యుడు' సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా. 'అభిమన్యుడు' తెరకెక్కించిన మిత్రన్‌ ఈ సీక్వెల్‌నీ తెరకెక్కిస్తున్నాడు. కాగా ఇదో థ్రిల్లర్‌ మూవీ అని తెలుస్తోంది. ఇకపోతే, రీసెంట్‌గా తెలుగులో 'జెర్సీ' సినిమాతో నా పేరు శ్రద్ధా శ్రీనాధ్‌, నా పేరు శ్రద్ధా శ్రీనాధ్‌ గుర్తు పెట్టుకోండి.. అంటూ తెగ డప్పు కొట్టి మరీ చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతో చెప్పినట్లుగానే మంచి గుర్తింపే దక్కించుకుంది. దాంతో పాటు, అవకాశాలు కూడా బాగానే దక్కించుకుంటోందట.

 

'జెర్సీ' కన్నా ముందే ఒప్పుకున్న 'జోడీ' సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తున్నాడు. తెలుగులో ఆల్రెడీ నటిగా ప్రూవ్‌ చేసుకున్న శ్రద్ధా, 'ఇరుంబుతిరై 2' (అభిమన్యుడు 2) మంచి విజయం అందుకుంటే, తమిళంలోనూ సత్తా చాటడం ఖాయమే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS