గ్లామ్‌షాట్‌: 'వల'లో పడిన శృంగారం.!

By iQlikMovies - December 29, 2018 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

ఈ పిక్‌లోని హాట్‌ బ్యూటీని గుర్తు పట్టారా.? ఈ ముద్దుగుమ్మకు చాలా చాలా పేర్లున్నాయి. ముఖ్యంగా వైజాగ్‌ సన్నీలియోన్‌ పేరు ప్రస్థావించుకోవాలి. 'టెంపర్‌' సినిమాలో ఎన్టీఆర్‌, ప్రకాష్‌రాజ్‌ పక్కన వైజాగ్‌ సన్నీలియోన్‌ పేరుతో తెగ నడుం తిప్పేసింది కదా, ఆ హాట్‌ ఐటెమే ఈ బ్యూటీ. 

 

అంతేకాదు, 'బాహుబలి ది బిగినింగ్‌'లో మనోహరి పాటలో చిందేసిన ముగ్గురు భామల్లో ఈ భామ ఒకరు. 'ఊపిరి'లో నెమలిగా వీల్‌ చైర్‌కి పరిమితమై లేచి డాన్స్‌ చేయలేని నాగార్జున మనసు కూడా కొల్లగొట్టేసిందీ నెమలి పాప. అంతేకాదు 'లోఫర్‌'లో మెగా ప్రిన్స్‌ సరసన, 'షేర్‌'లో నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌ సరసన కూడా హాట్‌ ఐటెంగా గుర్తింపు తెచ్చుకుంది. 

 

బేసిగ్గా ఈ పాప మొరాకో డాన్సర్‌. తెలుగులో ఇన్ని ఐటెం సాంగ్స్‌లో నటించినా బాలీవుడ్‌లో సెటిలైంది. హిందీ, మలయాళంలో ప్రస్తుతం సినిమాలు చేస్తోంది. ఇంతకీ ఈ హాట్‌ బేబ్స్‌ అసలు పేరు చెప్పనే లేదు కదా నోరా ఫతేహి. బ్లాక్‌ నెట్టెడ్‌ డిఫరెంట్‌ కాస్ట్యూమ్‌లో కెమెరాకి పోజిచ్చిన ఈ పిక్‌ ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS