ఈ ఏడాది కాజల్‌కి అంతగా కలిసి రాలేదు. మూడు చిత్రాల్లో నటించినా, మూడు ఆశించిన ఫలితాన్నివ్వలేదు చందమామకి. అయితే వచ్చే ఏడాది మాత్రం కాజల్‌కి పండగే అనుకోవాలి. బాలీవుడ్ 'క్వీన్' తమిళ రీమేక్‌గా తెరకెక్కుతోన్న 'ప్యారిస్ ప్యారిస్' చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌తో కాజల్ తెగ పాపులరైపోయింది. నెగిటివ్ అయినా, పోజిటివ్ అయినా, ఈ పాపులారిటీతో కాజల్ పేరు తెగ మార్మోగిపోయింది. దాంతో ఈ సినిమాపై ఆశక్తి బాగా పెరిగింది. కొత్త సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానుంది.
మరోవైపు కాజల్ అగర్వాల్ ని తెలుగు తెరకు పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో ఓ విభిన్న పాత్రలో కాజల్ కనిపించబోతోంది. ఇప్పుడీ సినిమా టాక్ ఆఫ్ ది టాపిక్ అయ్యింది. ఈ సినిమాతో కాజల్ విలన్ అవతారమెత్తబోతోందని టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమా స్టోరీని కాజల్ పాత్రను దృష్టిలో పెట్టుకునే రూపొందించాడట తేజ. దాదాపు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా ఈ సినిమాని అభివర్ణిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నా, కాజల్ పాత్రకే ఎక్కువ వెయిట్ ఇచ్చాడట డైరెక్టర్.
ఇదిలా ఉంటే, న్యూ ఇయర్ రిజల్యూషన్‌గా కాజల్ ఇకపై గ్లామర్ పాత్రలు తగ్గించి, ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించాలని అనుకుంటోందని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. అందుకనుగుణంగానే తాజా చిత్రంతో ఓ చిన్న ప్రయోగం చేయబోతోందట. ఆల్రెడీ 'అ' చిత్రంలో కాజల్ ప్రయోగం చేసేసింది. అయితే ఆ సినిమాతో ఆశించిన రిజల్ట్‌ని కాజల్ పొందలేదు. సో ఈ తాజా ప్రయోగం చందమామకు ఎంత మేర ఉపయోగపడుతుందో చూడాలిక.