రికార్డ్ అంటే ఇదీ.. RRR మ‌రో సంచ‌ల‌నం

మరిన్ని వార్తలు

ఎస్‌.స్‌.రాజ‌మౌళి సినిమా. అందులోనూ... రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్‌. ఇంకేం కావాలి..? రికార్డులు బ్రేక్ కావ‌డానికి. `బాహుబ‌లి` రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌గ‌ల స‌త్తా ఈ సినిమాకే ఉంద‌ని ముందు నుంచీ ట్రేడ్ వ‌ర్గాలు న‌మ్ముతున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే.. తొలి అడుగు వేసేసింది `ఆర్‌.ఆర్‌.ఆర్‌`. శాటిలైట్, డిజిట‌ల్ రైట్స్ విష‌యంలో కొత్త రికార్డు స్థాపించింది. ఏకంగా 200 కోట్ల‌కు ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కులు అమ్ముడుపోయాయ‌ని టాలీవుడ్ టాక్‌.

 

అదే నిజ‌మైతే.... ఈ దెబ్బ‌కు అన్ని రికార్డులూ బ్రేక్ అయిపోయిన‌ట్టే. డిస్నీ హాట్ స్టార్ ఈ సినిమా డిజిట‌ల్‌, శాటిలైట్ హ‌క్కుల్ని కైవ‌సం చేసుకుంద‌ని టాక్‌. అందుకు దాదాపు 200 కోట్లు వెచ్చించింద‌ట‌. ఇది సౌత్ ఇండియా రికార్డు. శాటిలైట్ హ‌క్కులు కూడా హాట్ స్టార్ ద‌గ్గ‌రే ఉన్నాయి. సినిమా ఇంకా 50 శాతం కూడా పూర్తి కాకుండానే, ఈ స్థాయిలో డిజిట‌ల్, శాటిలైట్ హ‌క్కులు అమ్ముడుపోయాయంటే... ఈ సినిమా క్రేజ్ అర్థం చేసుకోవొచ్చు.

 

పాన్ ఇండియా సినిమా ఇది. అన్ని భాష‌ల్లోనూ వ్యూవ‌ర్ షిప్ ఉంటుంది. దానికి తోడు.. `బాహుబ‌లి` త‌ర‌వాత రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న సినిమా. అందుకే హాట్ స్టార్ ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించి ఉంటుంద‌ని టాక్‌. ఇప్ప‌టికే ఎగ్రిమెంట్లు జ‌రిగిపోయాయ‌ని, అడ్వాన్సులు ఇచ్చిపుచ్చుకోవ‌డ‌మే త‌రువాయి అని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS