రష్మిక విషయంలో ఈ సారి ఆ గాసిప్‌ నిజమేనా?

మరిన్ని వార్తలు

తొలి సినిమాకే క్రేజ్‌ సంపాదించేసింది కన్నడ బ్యూటీ రష్మికా మందన్నా. ఆ మాటకొస్తే, ఎంట్రీ కాకుండానే అమ్మడి క్రేజ్‌పై బోలెడన్ని గాసిప్‌లొచ్చేశాయ్‌. వస్తూ వస్తూనే అమ్మడు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాలో నటిస్తోందట. ఈ సినిమా కోసం భారీ పారితోషికం అందుకుంటోందట.. లాంటి గాసిప్స్‌ అవి. అయితే, అవన్నీ అప్పట్లో నిజం కాలేదు కానీ, ఇప్పుడియితే నిజమే. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ రష్మిక.

 

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్‌తో రష్మికా జోడీ కూడా సెట్టయిపోయింది. అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే చిత్రంలో రష్మికానే హీరోయిన్‌. వీటితో పాటు, బోలెడన్ని క్రేజీ ప్రాజెక్టులూ రష్మికా చేతిలో ఉన్నాయి. నితిన్‌తో 'భీష్మ' ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. బ్లాక్‌ బస్టర్‌ పెయిర్‌ రష్మికా - విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తోన్న 'డియర్‌ కామ్రేడ్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ విషయాలన్నీ కాసేపు పక్కన పెడితే, తమిళం నుండీ రష్మికాపై గాసిప్‌లు గ్రాండ్‌గానే వచ్చాయి.

 

తమిళ స్టార్‌ హీరో ఇళయ దళపతి విజయ్‌ సినిమాలో రష్మికా అట.. అనే గాసిప్స్‌ అప్పట్లో తెగ చక్కర్లు కొట్టాయి. ఆ గాసిప్‌ని రష్మిక ఖండించింది. ఫ్యాన్స్‌ అందరూ ఊహించినట్లే ఆ ఛాన్స్‌ వస్తే అంతకన్నా ఆదృష్టమేంటని కూడా చెప్పింది. అయితే, ఆ అదృష్టం త్వరలో రష్మికాని వరించేలానే ఉంది. విజయ్‌ 64వ చిత్రంలో రష్మికాని హీరోయిన్‌గా తీసుకునేందుకు ఆలోచన చేస్తున్నారనీ కోలీవుడ్‌ వర్గాల సమాచారమ్‌. మరి ఈ సారి రష్మికా విషయంలో ఈ గాసిప్‌ నిజమేనేమో చూడాలిక. అన్నట్లు రష్మికా ఆల్రెడీ కార్తీ సినిమా ద్వారా తమిళంలో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS