జబర్దస్త్, పటాస్ షో లకు టెలివిజన్ లో ఎంత ఆదరణ ఉందో అందరికే తెలిసిందే.
అయితే నాణానికి రెండో వైపు మాత్రం ఈ రెండు షోలపై బూతు షో లు అనే ముద్ర కూడా పడింది. ఈ షో లు ఆపేయాలని కూడా పెద్ద చర్చ కూడా నడుస్తున్నది.
ఈ తరుణంలో జబర్దస్త్, పటాస్ షో ల దర్శక, నిర్మాతలకి హెచ్ ఆర్ సి నుండి నోటిసులు అందాయి. అయితే ఈ నోటిసులకి కారణం, సెన్సార్ బోర్డు సభ్యుడైన నందనం దీవాకర్ హెచ్ ఆర్ సి లో చేసిన ఫిర్యాదే అని తెలుస్తుంది.
మరి ఇప్పుడు ఈ నోటిసులకి ఎలా స్పందిస్తారో ఆయా షోల నిర్మాతలు అనేది వేచి చూడాలి.