విడివిడిగా కలివిడిగా హృతిక్‌రోషన్‌, సుజానే

మరిన్ని వార్తలు

హృతిక్‌ రోషన్‌ - సుజానే ఒకప్పుడు అందమైన జంట. ఈ ఇద్దరికీ పిల్లలున్నారు. కానీ, కొన్ని కారణాలతో హృతిక్‌, సుజానే తమ వైవాహిక బంధానికి గుడ్‌ బై చెప్పేశారు. చట్ట ప్రకారం విడాకులూ తీసుకున్నారు. విడాకులు తీసుకున్నా, తాము స్నేహితుల్లానే వుంటున్నామని పలు సందర్భాల్లో హృతిక్‌ చెబుతూ వస్తున్నాడు. అది నిజమే. తమ పిల్లల కోసం ఈ ఇద్దరూ తరచుగా కలుసుకుంటుంటారు. విదేశీ యాత్రలకు వెళుతుంటారు. అలా వెళ్ళినప్పుడు హృతిక్‌, సుజానే జంటని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.

కలిసి జీవించలేమనే నిర్ణయానికి వచ్చాక విడిపోవడమే మేలు. ఎందుకంటే, విడిపోయాక స్నేహం పెరగొచ్చు. కలిసే వుండి, కొట్టుకోవడం వల్ల ఫలితం వుండదని హృతిక్‌ రోషన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. విదేశాల్లో సుజానే, తాను తన పిల్లలతో ఎంజాయ్‌ చేస్తున్నప్పుడు తీసిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో పెట్టాడు హృతిక్‌ రోషన్‌. అయితే ఈ జంట తీరు చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. 'విడిపోయి వుండటం ఎందుకు.. మళ్ళీ కలసిపోవచ్చు కదా.?' అని కొందరు ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు.

'మేం ప్రేమించి, పెళ్ళి చేసుకున్నాం. విడిపోవడానికి కారణాలేంటో మాకు తెలుసు. మేం ఎలా వుండాలో కూడా మాకు తెలుసు. మేం ఇప్పుడు హ్యాపీగానే వున్నాం..' అని క్లారిటీ ఇచ్చిన హృతిక్‌ రోషన్‌, పిల్లలకి తల్లిదండ్రుల అవసరం చాలా వుంటుందనీ, ఆ అవసరాల్ని తామిద్దరం గురించామని వివరించాడు. మంచి భార్యా, భర్తల్లా జీవించలేకపోయిన తాము, మంచి స్నేహితుల్లా.. మంచి తల్లిదండ్రుల్లా వుండగలమని అన్నాడు ఈ బాలీవుడ్‌ హీరో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS