హృతిక్‌ని చూసి షాకైన పూజా హెగ్దే.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ గ్రీకువీరుడు హృతిక్‌ రోషన్‌ని చూసి టాలీవుడ్‌ ముద్దుగుమ్మ పూజా హెగ్దే షాకైందట. అదేంటీ అనుకుంటున్నారా? అవును ఓ పోస్టర్‌లో హృతిక్‌ని చూసి పూజా షాకైందట. ఏంటా పోస్టర్‌? ఏంటా షాకింగ్‌ న్యూస్‌.? అనుకుంటున్నారా? 

బీహార్‌కు చెందిన ఆనంద్‌కుమార్‌ రూపొందించిన 'సూపర్‌ 30' ప్రోగ్రామ్‌ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అందులో హృతిక్‌ రోషన్‌ ఆనంద్‌ కుమార్‌ పాత్ర పోషిస్తున్నాడు. 30 మంది విద్యార్ధుల మధ్యలో హృతిక్‌ కూర్చుని ఉన్న పోస్టర్‌ని ఈ రోజు టీచర్స్‌ డే సందర్భంగా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో హృతిక్‌ని ట్రాన్స్‌ఫర్మేషన్‌ చూసి పూజా హెగ్ధే షాక్‌ తిన్నదట. అంతలా ఆ పాత్రలో హృతిక్‌ లీనమైపోయాడు మరి. అంతేగా హృతిక్‌కి ఎలాంటి పాత్ర వేసినా అంతే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేస్తాడు. 

ఇకపోతే ఇంతకీ ఈ ఆనంద్‌కుమార్‌ కథేంటంటారా? టాలెంట్‌ ఉండి చదువుకునే స్థోమత లేని పిల్లలకు ఆనంద్‌ కుమార్‌ ట్రిపుల్‌ ఐటీలో శిక్షణ ఇప్పిస్తూ ఉంటారు. ఏటా 30 మంది పిల్లల చొప్పున ఎంచుకుని వారిని ఐటీ జమ్స్‌లా తీర్చిదిద్దుతుంటారు ఆనంద్‌ కుమార్‌. అలాంటి ఓ గొప్ప అధ్యాపకుని పాత్రనే హృతిక్‌ రోషన్‌ ఈ సినిమాలో పోషిస్తున్నారు. 

తాజాగా విడుదలైన పోస్టర్‌పై 'రాజు కుమారుడు రాజు కాలేడు. ఎవరికైతే హక్కుంటుందో వారే రాజవుతాడు..' అని రాసున్న క్యాప్షన్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ పోస్టర్‌ని తన ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ పూజాహెగ్దే పై విధంగా స్పందించింది. గతంలో బాలీవుడ్‌లో హృతిక్‌తో కలిసి 'మొహంజోదారో' చిత్రంలో నటించింది పూజాహెగ్దే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS