'ఎన్టీఆర్‌'లో జయప్రద ఎవరంటే.!

మరిన్ని వార్తలు

బాలకృష్ణ ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఎన్టీఆర్‌'లో పలు ప్రధాన పాత్రల ఎంపిక జరుగుతోన్న సంగతి తెలిసిందే. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఇప్పటికే ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రను బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ న్యూస్‌లో అధికారికంగా ప్రకటన వెల్లడైంది. 

అయితే ఇతర పాత్రల కోసం ఇంకా అఫీషియల్‌ క్లారిటీ రావాల్సి ఉంది. అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటిస్తోందన్న సంగతి కూడా దాదాపు ఖరారైనట్లే. అలాగే తాజాగా మరో నటి జయప్రద పాత్రలో ముద్దుగుమ్మ రాశీఖన్నా నటిస్తోందనీ వార్తలు వినిపిస్తున్నాయి. 'తొలిప్రేమ' సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల 'శ్రీనివాస కళ్యాణం' సినిమాతో కాస్త నిరాశపరిచింది. 

ఇప్పుడు 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో జయప్రద పాత్రలో నటిస్తోందంటూ వచ్చిన వార్తలపై రీసెంట్‌గా రాశీఖన్నా స్పందించింది. ఆ పాత్ర కోసం తననెవరకూ సంప్రదించలేదనీ, ఒకవేళ అలాంటి అవకాశమే వస్తే అంతకు మించిన అదృష్టం ఇంకేముంటుందన్నట్లుగా సంకేతాలు పంపిస్తోంది. 

చూడాలి మరి జయప్రదగా రాశీఖన్నా కనిపించి, మెప్పిస్తుందో లేదో. మరోవైపు హరికృష్ణ పాత్రలో కళ్యాణ్‌రామ్‌ నటిస్తున్నాడంటూ ఇంకో పక్క వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఎస్వీ. రంగారావు పాత్రలో మెగా బ్రదర్‌ నాగబాబు నటిస్తారట అనే టాక్‌ కూడా ప్రచారంలో ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS