‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అనే సినిమా పేరు గుర్తుంది కదా. సుధీర్‌బాబు, నందితా జంటగా తెరకెక్కిన ఈ సినిమా బ్యూటిఫుల్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ. అయితే, ఇప్పుడు మనం చర్చించుకోబోయే విషయమేంటంటే, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి. ఈయన గత కొన్నేళ్లుగా భార్య సుసానేకి విడాకులిచ్చి పిల్లలతో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే.
అయితే, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాచి కూర్చున్న వేళ 21 రోజులు ఇండియాకి లాక్‌డౌన్ ప్రకటించారు మన ప్రధానమంత్రి మోడీ గారు. ఈ లాక్‌డౌన్ హృతిక్ అండ్ సుసానేకి మంచి చేసింది. లాక్‌డౌన్ కారణంగా తన ఇద్దరి పిల్లల రక్షణ నేపథ్యంలో తల్లి సుసానే ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఈ 21 రోజులు తన పిల్లలతో కలిసి హృతిక్ దగ్గరే ఉండాలని నిర్ణయించుకుంది. ఎప్పుడో విడిపోయిన ఈ జంట కలవడానికి కరోనా కారణమైందన్న మాట. ఒక తల్లికి పిల్లలపై ఉన్న ప్రేమ ఎంత గొప్పదో ఈ తాజా విషయం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ 21 రోజులు హృతిక్ రోషన్ తన భార్య సుసానేతో కలిసి ఉండబోతున్నారన్న మాట. పిల్లల కోసం ఇంతటి ఉన్నతమైన నిర్ణయం తీసుకున్న తన భార్యను ప్రశంసిస్తూ హృతిక్ ట్విట్టర్ ద్వారా ఈ విషయం ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు.
Couldn’t ask for a better view.
— Hrithik Roshan (@iHrithik) March 23, 2020
.
Or a more suited book.#Coexist pic.twitter.com/kzvDkquczw