సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ, నటిగా మంచి పేరు తెచ్చుకుంటున్న ముద్దుగుమ్మల్లో మాళవికా నాయర్ ఒకరు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ, తర్వాత ‘కళ్యాణ వైభోగమే’ సినిమాతో పాపులర్ అయ్యింది. తర్వాత ‘విజేత’, ‘ట్యాక్సీవాలా’ సినిమాల్లో నటించింది. అన్నీ బాగుంటే, ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాతో ఈ ఉగాదికి ప్రేక్షకుల్ని పలకరించేది. కానీ, కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడడంతో ప్రస్తుతం కరోనా హాలీడేస్‌ని ఎంజాయ్ చేస్తూ ఇంట్లోనే కాలక్షేపం చేస్తోందట.
మొన్నా మధ్య ఓ ఇంటర్వ్యూలో తనకు పెద్దగా ఫ్రెండ్స్ లేరని చెప్పిన మాళవిక, విజయ్ దేవరకొండ సమ్‌థింగ్ స్పెషల్ గై అంటోంది. అఫ్‌కోర్స్ మన రౌడీతో ఫ్రెండ్‌షిప్ ఆల్వేస్ సమ్‌థింగ్ స్పెషలే అనుకోండి. విజయ్‌తో మాళవికా మూడు సినిమాల కోసం స్క్రీన్ షేర్ చేసుకుంది. అందుకే ఆయనతో కాస్త చనువెక్కువ అని చెబుతోంది. విజయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రతీ ముద్దుగుమ్మా చెప్పే మాటిదే. అలాంటిది మూడు సినిమాల్లో నటించిన ఈ భామ చెప్పడం వింతేం లేదంటారా.? సర్లెండి ఎవరి అభిప్రాయాలు వారికుంటాయ్. ఇకపోతే, ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాలో మాళవికా నాయర్, రాజ్‌తరుణ్‌తో జత కట్టిన సంగతి తెలిసిందే.