క‌ల్కి... రేట్లు మామూలుగా లేవు!

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో ప్ర‌స్తుతానికి అత్యంత ఖ‌రీదైన చిత్రంగా 'క‌ల్కి'ని గుర్తించొచ్చు. టాలీవుడ్ అనేంటి.. ద‌క్షిణాదిలోనే అత్కంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షూటింగ్ కూడా పూర్తి కావొస్తోంది. మే 9న విడుద‌ల చేస్తున్నామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. అయితే రిలీజ్ డేట్ కాస్త డైలామాలో ఉంది. ఆ స‌మ‌యానికి కల్కి పూర్తి కాక‌పోవొచ్చ‌ని టాక్‌.


మ‌రోవైపు క‌ల్కి బిజినెస్ హ‌డావుడి మొద‌లు కానే లేదు. నిజానికి ఇలాంటి క్రేజీ సినిమాల‌కు బిజినెస్ హాట్ కేక్ అయిపోతుంది. కానీ క‌ల్కి ఒక్క ఏరియా కూడా సేల్ కాలేదు. దానికి కార‌ణం.. నిర్మాత‌లు చెబుతున్న రేట్లే. స‌లార్‌ కంటే 30 శాతం ఎక్కువ రేట్లు కోడ్ చేస్తోంది వైజ‌యంతీ మూవీస్. ఓవ‌ర్సీస్ దాదాపు రూ.100 కోట్లు అడుగుతోంది. ఆ రేటుకి సినిమా కొంటే ఆల్ టైమ్ రికార్డ్ అవుతుంది. నైజాం, ఆంధ్రా.. ఇవ‌న్నీ స‌లార్ కంటే ఎక్కువే ఉన్నాయి. కల్కి పై క్రేజ్ ఉన్న మాట వాస్త‌వ‌మే. కానీ మ‌రీ ఈ స్థాయిలో రేట్లు చెబితే బ‌య్య‌ర్లు భ‌య‌ప‌డిపోరూ..?  పైగా రిలీజ్ డేట్ విష‌యంలో క్లారిటీ లేదు.


ఈ సినిమా మే 9న రావ‌డ‌డం దాదాపు అసాధ్యంగా క‌నిపిస్తోంది. రిలీజ్ డేట్ పై డౌట్ ఉన్న‌ప్పుడు ఏ బ‌య్య‌రూ ముందుకు రాడు. అది.. క‌ల్కికి ఉన్న అతి పెద్ద స‌మ‌స్య‌. పైగా ఇంతింత రేట్లు పెట్టి, సినిమాని కొన‌డానికి బ‌య్య‌ర్లు పెద్ద రిస్కే చేయాలి. స‌లార్‌ అప్ప‌టికి భారీ రేటే. పెద్ద హిట్ట‌యినా బ‌య్య‌ర్ల‌కు 10 నుంచి 20 శాతం పోయింది. పైగా.. కొన్ని ఏరియాల్లో న‌ష్టాలొచ్చాయి. దాంతో నిర్మాత‌లు కొంత మొత్తం వెన‌క్కి తిరిగి ఇవ్వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇప్పుడు స‌లార్‌ కంటే ఎక్కువ మొత్తం కోట్ చేస్తోంది వైజ‌యంతీ మూవీస్‌. దాంతో బ‌య్య‌ర్లు వేచి చూసే ధోర‌ణిలో ప‌డిపోయారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS