సౌత్ ఇండియాలో సంచలనం సృష్టించిన సినిమా కేజీఎఫ్. బాలీవుడ్ లోనూ గొప్పగా రాణించింది. బాహుబలితో పోటీ పడి మంచి వసూళ్లు రాబట్టింది. అందుకే కేజీఎఫ్ 2 పై ఆశలు అంచనాలూ పెరిగిపోయాయి. ఈ వేసవిలో విడుదల కావాల్సిన సినిమా ఇఇ. కరోనా, లాక్ డౌన్ వల్ల.. చిత్రీకరణ ఆలస్యమై, విడుదల వాయిదా పడింది. అయితే.. ఈసినిమా రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేజీఎఫ్ శాటిలైట్ రైట్స్ 120 కోట్లకు అమ్ముడుపోయినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఇది పెద్ద మొత్తమే. తెలుగులోనూ మంచి రేటు పలుకుతోందట. అటూ ఇటుగా రూ.70 కోట్లకు ఈ సినిమా అమ్ముడుపోయే ఛాన్సుందని తెలుస్తోంది. కేజీఎఫ్ 1ని తెలుగులో సాయి కొర్రపాటి విడుదల చేశారు. అదీ కమీషన్ బేస్ మీదే. కేజీఎఫ్ విడుదలకు ముందు అంతగా డిమాండ్ లేదు. ఎవరికీ నమ్మకాల్లేవు. అందుకే సాయి కొర్రపాటి తన నిర్మాణ సంస్థ ద్వారా విడుదల చేశారు. ఈసారి అలా కాదు.. గట్టి పోటీ ఎదురవుతోంది. రూ.70 కోట్లకు రేటు పలుకుతోంది. మరి ఈ సినిమాని ఎవరు దక్కించుకుంటారో?