'దిల్‌' రాజుగారా.. మజాకానా.!

By Inkmantra - March 19, 2019 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

ఈ ఏడాది సంక్రాంతికి ఓ మోస్తరు అంచనాలతో విడుదలై ఏకైక బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సినిమా 'ఎఫ్‌ 2'. సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. విడుదలై మూడు నెలలైనా ఈ సినిమాకి క్రేజ్‌ ఇంకా తగ్గలేదు. ఇక ఇప్పుడు మరోసారి 'ఎఫ్‌ 2' సరికొత్తగా క్రేజ్‌ సంపాదిస్తోంది. 'ఎఫ్‌ 2 డిలీటెడ్‌ సీన్స్‌' పేరుతో కొన్ని వీడియోలను దిల్‌ రాజు అఫీషియల్‌ ఖాతా నుండి యూ ట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. 

 

ఈ వీడియోలకు భారీ ఎత్తున రెస్పాన్స్‌ వస్తోంది. వ్యూస్‌ పోటెత్తుతున్నాయి. రికార్డు స్థాయిలో ఈ వీడియోస్‌ వ్యూస్‌ దక్కించుకోవడంతో ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు సరికొత్తగా పబ్లిసిటీ స్ట్రేటజీని ఫాలో చేస్తున్నారు. ఈ వీడియోలకు మరింత ప్రమోట్‌ చేస్తున్నారు. గతేడాది దిల్‌ రాజు నుండి ఐదారు సినిమాలు రిలీజైనా చెప్పుకోదగ్గ హిట్‌ సొంతం చేసుకోలేకపోయాయి. కానీ ఈ ఏడాది 'ఎఫ్‌ 2'తో కొట్టిన హిట్‌కి ఎక్స్‌ట్రా ఎనర్జీ యాడ్‌ అయ్యింది రాజుగారికి. 

 

త్వరలో మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాతో మరో హిట్‌ సొంతం చేసుకోవాలనే గట్టి కసితో ఉన్నారు దిల్‌రాజు. తర్వాత యంగ్‌ హీరో శర్వానంద్‌తో రూపొందిస్తున్న సినిమా కూడా ఈ సమ్మర్‌కి లైన్‌లో ఉన్నట్లు సమాచారమ్‌. తాజాగా రాజ్‌తరుణ్‌తో ఓ సినిమాకి దిల్‌రాజు రంగం సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి రాజుగారి స్ట్రేటజీ ఈ ఏడాది ఎలా వర్కవుట్‌ అవ్వనుందో.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS