గెడ్డం ఎంత ప‌నిచేసె నారాయ‌ణ‌...!

మరిన్ని వార్తలు

మ‌హేష్ బాబు - సుకుమార్ కాంబినేష‌న్‌లో సినిమా ఆగిపోవ‌డం ప‌రిశ్ర‌మ‌లో సంచ‌ల‌నం సృష్టించింది. సినిమాలు మొద‌ల‌వ్వ‌డం, ఆగిపోవ‌డం మామూలే. కానీ ఎప్పుడూ జ‌ర‌గ‌నంత డ్రామా.. ఈ కాంబో విష‌యంలో జ‌రిగింది. మ‌హేష్ కి చెప్పాపెట్ట‌కుండా సుకుమార్ బ‌న్నీతో సినిమా ఫిక్స్ చేసుకోవడం, మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్‌లో 'క్రియేటీవ్ డిఫ‌రెన్సెస్‌' అంటూ క్లారిటీ ఇవ్వడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

 

అస‌లు ఈ సినిమా ఎందుకు ఆగిపోయింద‌న్న విష‌యంపై ర‌క‌ర‌కాల వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇప్పుడు మ‌రో వార్త టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం సుకుమార్ మ‌హేష్‌ని గెడ్డం పెంచ‌మ‌ని కోరాడ‌ట‌. అలా గెడ్డం పెంచ‌డం త‌న ఫ్యాన్స్‌కి న‌చ్చ‌ద‌ని మ‌హేష్ నిరాక‌రించాడ‌ట‌. త‌న హీరోని ఫుల్ లెంగ్త్ గ‌డ్డంలో ఊహించుకున్న సుకుమార్‌.. మ‌హేష్ బాబు నో చెప్పేస‌రికి హ‌ర్ట్ అయ్యాడ‌ని, అందుకే ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడ‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు.

 

రంగ‌స్థ‌లంలో చ‌ర‌ణ్ గెడ్డం పెంచి మాసీగా క‌నిపించాడు. మ‌హేష్‌నీ అలాంటి లుక్‌లోనే ఊహించాడు సుకుమార్‌. కానీ మ‌హేష్ ఇప్పటి వ‌ర‌కూ గెడ్డం పెంచిందే లేదు. అందుకే.. నిరాక‌రించాడేమో.? మొత్తానికి ఓ గెడ్డం స‌మ‌స్య‌.. ఓ సినిమాని ఆపేసింది. విచిత్రంగా!!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS