విజయ్ దేవరకొండ మరో సంచలనానికి తెర లేపాడు. నిన్న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా తన తాజా సినిమా 'టాక్సీవాలా' సినిమా ప్రమోషన్‌ని ఇన్నోవేటివ్‌గా ప్లాన్ చేశాడు. ఓ మూడు ఐస్ క్రీం ట్రక్కుల్ని సిటీలోకి వదిలి పేదవారికి ఫ్రీగా ఐస్ క్రీమ్ పంచి పెట్టిన సంగతి తెలిసిందే.
అందులో భాగంగానే, సిటీలో మండిపోతున్న ఎండని సైతం లెక్క చేయకుండా ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తూ, తమ బాధ్యతను కరెక్ట్‌గా నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు విజయ్ దేవరకొండ ఫ్రీ ఐస్ క్రీములు మండుటెండలో చల్లదనాన్ని పంచాయి. అందుకు కృతజ్ఞతగానే ట్రాఫిక్ పోలీసులు విజయ్ దేవరకొండకి బర్త్‌డే విషెస్ చెప్పి, 'పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లుడుగారూ..' అని ట్రాఫిక్ పోలీసుల ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టారు.
ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవడంతో పాటు, అసలెందుకు ట్రాఫిక్ పోలీసులు విజయ్‌ని 'అల్లుడు గారూ..' అని సంబోధించారని తలలు బాదుకుంటున్నారు. అయితే దీనికి పాత స్టోరీ ఉందిలెండి. అర్జున్‌రెడ్డి సినిమాలో తలకు హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ డ్రైవ్ చేసే సీన్ ఒకటి ఉంటుందట. ఆ సీన్‌కి ట్రాఫిక్ పోలీసులు స్పందించి, తమ ట్విట్టర్‌లో హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయడం నేరం, ప్రాణానికి ప్రమాదం అని హెచ్చరిస్తున్నట్లుగా ఓ ట్వీట్ పెట్టారట.
అందుకు ఇన్‌టైంలో స్పందించిన విజయ్ దేవరకొండ 'సారీ మామా..నెక్ట్స్ టైం పక్కా' అని ట్వీట్ చేశాడట. అందుకే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఇలా ట్వీట్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. మొత్తానికి అర్జున్‌రెడ్డి ఎఫెక్ట్ విజయ్‌ని ఇంకా వెంటాడుతూనే ఉందనుకోవాలా? లేక ట్రాఫిక్ పోలీసులకు అర్జున్‌రెడ్డి కూల్ కూల్ ఐస్‌క్రీమ్‌తో క్రీమ్ బిస్కెట్ వేశాడనుకోవాలా? ఏదేమైనా విజయ్ సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్ గై.!