జబర్దస్త్‌ ఆది నిజంగానే కష్టాల్లో పడ్డాడా?

మరిన్ని వార్తలు

ఈ టీవీ నవ్వుల షో జబర్దస్త్‌ నుండి నాగబాబు బయటికి వెళ్లిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, నాగబాబు అధికారికంగా ఈ విషయమై స్పందించలేదు. కానీ, ఈ ఇష్యూ దాదాపు కన్‌ఫామ్‌ అని తెలుస్తోంది. నాగబాబుకు అత్యంత సన్నిహితులు, జబర్దస్త్‌ నిలబడడానికి కారకులైన కమెడియన్లు సుధీర్‌, గెటప్‌ శీను, చంద్ర, ఆది తదితరులు కూడా నాగబాబుతో సహా బయటికి వచ్చేశారంటూ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

 

అయితే, వీరెవ్వరికీ లేని కష్టం పాపం ఆదికి వచ్చిందంటున్నారు. ఎందుకంటే, ఆదితో మల్లెమాల టీమ్‌ కొన్ని కమిట్మెంట్స్‌ పెట్టుకుందట. ఆ కమిట్మెంట్స్‌ని పక్కన పెట్టి, ఆది బయటికి రావడాన్ని సదరు మల్లెమాల సంస్థ ఒప్పుకోవడం లేదట. దాంతో ఆది కష్టాల్లో పడ్డట్లు తెలుస్తోంది. నిజానికి జబర్దస్త్‌ నుండి బయటికి వచ్చేసినా ఆదికి వచ్చిన నష్టమేమీ లేదు. వెండితెరపైనా తనదైన అవకాశాలతో కెరీర్‌ని జోరుగా నడిపిస్తున్నాడు హైపర్‌ ఆది. సో జబర్దస్త్‌ని వదిలేసినా, కెరీర్‌ పరంగా నిలదొక్కుకోగల సత్తా ఆయనలో ఉంది.

 

అయితే, వినిపిస్తున్న టాక్‌ ప్రకారం, ఆదికి, మల్లె మాల నిర్మాతలకు ఉన్న ఆ తెర వెనక కమిట్మెంట్స్‌ ఏంటో కానీ, అటు జబర్దస్త్‌ని వదల్లేక, ఇటు నాగబాబునీ వదల్లేక అన్నట్లుగా మారిందట ఆది పరిస్థితి. అయితే, నిజంగానే నాగబాబు జబర్దస్త్‌ని వదిలేశారా.? బయట ఇంత రచ్చ జరుగుతున్నందుకు నాగబాబు ఎందుకని ఈ విషయంలో ఫ్యాన్స్‌కి క్లారిటీ ఇవ్వడం లేదు.? అనేది తెలియాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS